అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం..తల్లిని తిట్టటం కరెక్టేనా-రాష్ట్ర పరువు తీస్తున్నారు : గిట్టని మనిషి అధికారంలో ఉన్నాడనే- సీఎం జగన్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి ప్రస్తుత పరిణామాల పైన స్పందించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా సీఎం తన ప్రసంగంలో ప్రస్తుత అంశాలను ప్రస్తావించారు. పట్టాభి అన్న పదాలను ప్రస్తావిస్తూ..ఆవేదన వ్యక్తం చేసారు. ఆ పదానికి అర్దం ఏంటో చెప్పారు. సీఎం తల్లిని తిడుతున్నారని ఆవేదనతో చెప్పారు. సీఎంను కూడా దారుణమైన బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రిని ఇంత అసహ్యంగా తిట్టాలి..సీఎంను అభిమానించే వారిని రెచ్చగొట్టాలి..గొడవలు జరగాలని వారి ఆలోచన గా చెప్పారు.

సీఎంను..తల్లిని తిట్టటం కరెక్టేనా..

సీఎంను..తల్లిని తిట్టటం కరెక్టేనా..

రాజకీయ నేతల్లోనూ అసాంఘిక శక్తులను చూస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి..తల్లిని తిట్టటం కరెక్టేనా అని ప్రశ్నించారు. అధికారం దక్కలేదని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పారు. చీకట్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సంక్షేమ పధకాలను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. డ్రగ్స్ ఏపీ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని..దీని పైన డీజీపీ స్పష్టత ఇచ్చిన తరువాత కూడా ఇంకా అదే రకమైన ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. నేరగాళ్లు రూపం మార్చుకున్నారని.. రాజకీయాల్లోనూ సంఘ విద్రోహ శక్తులు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.

గిట్టని మనిషి అధికారంలో ఉంటే తట్టుకోలేకనే

గిట్టని మనిషి అధికారంలో ఉంటే తట్టుకోలేకనే

గిట్టని మనిషి అధికారంలో ఉంటే తట్టుకోలేకపోతున్నారని.. అసత్య ఆరోపణలతో రాష్ట్ర పరువు- ప్రతిష్ఠలను దిగజారుస్తున్నారని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇది అనైతికం..అధర్మమని చెప్పారు. సంఘ విద్రోహ శక్తుల విషయంలో కఠినంగా ఉండాలని పోలీసులకు సూచించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని స్పష్టం చేసారు. తన..మన అనే బేధం లేకుండా లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ మాత్రం రాజీ పడవద్దని పోలీసులకు సీఎం స్పష్టం చేసారు.

అధికారం దక్కదనే అక్కసుతో

అధికారం దక్కదనే అక్కసుతో

తాము గెలవలేదని..తమకు అధికారం దక్కలేదని...అన్ని ఎన్నికల్లో ఓడిపోవటం..ప్రజలు అధికార పార్టీకి అఖండ విజయం దక్కించారనే ఉద్దేశం..ఇక, తమకు అధికారం దక్కదనే అక్కసుతో రాష్ట్ర పరువు తీస్తున్నారని ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. పిల్లల భవిష్యత్ పైన కళంక ముద్ర వేస్తున్నారన్నారు. వీళ్లంతా సీఎం - ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటమే కాదని..రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి మీద చేస్తున్న దాడిగా పేర్కొన్నారు.

రాష్ట్ర పరువు ప్రతిష్టలను దిగజార్చేలా

రాష్ట్ర పరువు ప్రతిష్టలను దిగజార్చేలా

ఏపీలోని పిల్లలను డ్రగ్స్ ఎడిక్టర్లుగా చూపిస్తున్నారని చెప్పారు. ఇది పచ్చి అబద్దమని సీఎం వివరించారు. డీఆర్ఐ, కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినా..అదే రకమైన ప్రచారం చేస్తున్నారని సీఎం సీరియస్ అయ్యారు. లెక్కలేని తనం..అక్కసుతో కుట్ర పూరితంగా రాష్ట్ర పరువును తీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. నేటి నుంచి ఏపీలో పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసు శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పారు.

Recommended Video

Telangana : అంత అహంకారం ఎందుకు.. రాష్ట్రానికి ఏం చేశాడని..? - Konda Raghava Rao
పోలీసులకు వీక్లీ ఆఫ్ నేటి నుంచే అమలు

పోలీసులకు వీక్లీ ఆఫ్ నేటి నుంచే అమలు

కోవిడ్‌ వల్ల చనిపోయిన పోలీసులుకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశాం. కరోనా బారిన పడిన పోలీసులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాం. హోంగార్డుల ప్రత్యేక వేతనాన్ని కూడా పెంచాం. గత ప్రభుత్వం పోలీసుశాఖకు బకాయి పెట్టిన 1500 కోట్ల రూపాయలను విడుదల చేశాం'' అని సీఎం జగన్‌ తెలిపారు. మహిళలు...బడుగు బలహీన వర్గాల పైన కుల పర దాడులు జరిగితే ఉపేక్షించవద్దని సీఎం సూచించారు.

English summary
Is it fair to use filthy language on a CM?TDP is letting the state into shame says YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X