వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీలో తాజా పరిస్థితికి లోకేష్ కారణమా ? బాబు నిర్లిప్తతపై బుచ్చయ్య ఎపిసోడ్ తో ఏపీలో హాట్ టాపిక్ !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అధికార పార్టీతో గట్టిగా తలబడి, నిలబడలేక, టీడీపీ కీలక నాయకులపై నమోదవుతున్న కేసులతో నానా అగచాట్లు పడుతోంది. ఇక మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు పార్టీలో కీలక నేతలు పార్టీపై వ్యక్తం చేస్తున్న అసంతృప్తి, అలకల పర్వం వెరసి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పెద్ద తలనొప్పిని ఫేస్ చేస్తుంది. అధినేత చంద్రబాబు పార్టీలో అంతర్గత సమస్యలను పరిష్కరించ లేక, అధికార పార్టీతో యుద్ధం చేయలేక తిప్పలు పడుతున్నారు. తాజా పరిణామాలకు లోకేష్ కూడా కారణం అన్న భావన చంద్రబాబును మరింత ఇబ్బంది పెడుతుంది.

టీడీపీలో లుకలుకల పర్వం

టీడీపీలో లుకలుకల పర్వం

తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ఉనికి ప్రశ్నార్థకమైన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పార్టీలో నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, వినిపిస్తున్న ధిక్కార స్వరాలు టిడిపిలో ఉన్న లుకలుకలను బయటపెడుతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సొంత పార్టీపై అలక వహించటం , సీనియర్లను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చెయ్యటం , అంతకు ముందు అచ్చెన్నాయుడు లోకేష్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు బయటకు వచ్చిన ఆడియోలు టీడీపీలో సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది.

నారా లోకేష్ పై పార్టీ సీనియర్లలో అసహనం .. బుచ్చయ్య వ్యాఖ్యలతో బట్టబయలు

నారా లోకేష్ పై పార్టీ సీనియర్లలో అసహనం .. బుచ్చయ్య వ్యాఖ్యలతో బట్టబయలు

మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పెదబాబు పట్టించుకోవటం లేదు.. కనీసం చినబాబైనా పట్టించుకోకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్న తీరు లోకేష్ పై తీవ్ర అసహనంలో ఉన్నారన్న సంకేతానికి ఉదాహరణగా నిలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ ను కీలకం చెయ్యాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలను పెద్దగా పట్టించుకోవటం లేదని, అన్ని నిర్ణయాలు లోకేష్ మీద వదిలిపెడితే లోకేష్ సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా యూత్ ను ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని కొంతకాలంగా సీనియర్లలో ఆవేదన ఉంది. పార్టీ కోసం కీలకంగా పని చేసిన నాయకులను పక్కన పెడుతున్నారన్న టాక్ ప్రధానంగా టీడీపీలో వినిపిస్తుంది.

లోకేష్ టార్గెట్ .. గతంలో అచ్చెన్న, ఇప్పుడు గోరంట్ల వ్యాఖ్యలు

లోకేష్ టార్గెట్ .. గతంలో అచ్చెన్న, ఇప్పుడు గోరంట్ల వ్యాఖ్యలు

గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలకతో టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుత టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గతంలో లోకేష్ ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ లేదు బొక్కా లేదని, లోకేష్ తీరుపై అచ్చెన్న అసహనం వ్యక్తం చేసిన సందర్భాన్ని ఇప్పుడు తాజా పరిణామాలతో గుర్తు చేసుకుంటున్నారు.

అచ్చెన్న వ్యాఖ్యలు నేటికీ వైసీపీ నాయకులకు టార్గెట్ అయ్యాయి. పార్టీలో సీనియర్ల అభిప్రాయాలకు విలువ లేదని జరుగుతున్న చర్చ లోకేష్ నే టార్గెట్ చేస్తుంది. గతంలోలా చంద్రబాబు పట్టించుకోవటం లేదని,లోకేష్ సీనియర్ల మాటకు విలువ ఇవ్వటం లేదని, 2019 ఎన్నికల్లో ఓటమికి కూడా లోకేష్ నిర్ణయాలే కారణమని పలువురు సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి లేకపోలేదు. గతంలో పార్టీని వదిలివెళ్ళిన వల్లభనేని వంశీ వంటి నాయకులు కూడా లోకేష్ వల్లే పార్టీ నాశనం అవుతుందని బాహాటంగానే తీవ్ర వ్యాఖ్యలు చేసి వెళ్ళారు.

2014 లో విజయం వెనుక సీనియర్లు ..2019ఎన్నికల ఓటమికి కారణం లోకేష్ నిర్ణయాలు

2014 లో విజయం వెనుక సీనియర్లు ..2019ఎన్నికల ఓటమికి కారణం లోకేష్ నిర్ణయాలు

2014లో ఎన్నికలకు వెళ్ళినప్పుడు అప్పట్లో చంద్రబాబు కుడి ఎడమ భుజాలు గా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు కీలకంగా వ్యవహరించారు. టికెట్ల కేటాయింపులోను, తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో కి తీసుకు వెళ్లడం లోనూ నాడు సీనియర్లు కీలకంగా వ్యవహరించారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.

ఆ తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ బాధ్యతలను లోకేష్ కు అప్పగించాలనే, పార్టీలో క్రమంగా కీలక నేతగా లోకేష్ ఎదిగేలా చేయాలని నిర్ణయం తీసుకోవడంతో క్రమక్రమంగా లోకేష్ నిర్ణయాలు పార్టీ సీనియర్ లలో అసంతృప్తికి కారణమయ్యాయి. ఆ తర్వాత 2019లో జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్ళ లేకపోవడం వెనుక లోకేష్ నిర్ణయాలు ఉన్నాయని పార్టీలో సైతం చర్చ జరిగింది. లోకేష్ 2019లో టిడిపి ఓటమి పాలైందని అంతర్గతంగా కూడా సీనియర్ నాయకులలో అసహనం ఉంది.

పార్టీలో ప్రాధాన్యత లేకుంటే పార్టీలో ఉండటం దేనికి ? సీనియర్ల ప్రశ్న

పార్టీలో ప్రాధాన్యత లేకుంటే పార్టీలో ఉండటం దేనికి ? సీనియర్ల ప్రశ్న

ఇక ఇప్పటికైనా పార్టీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధినేత పార్టీపై దృష్టి పెట్టి సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సీనియర్ల నుండి డిమాండ్ వినిపిస్తోంది. పార్టీకి సీనియర్లు అవసరమే లేకపోతే పార్టీలో ఉండడం దేనికనే ప్రశ్నకూడా ఉత్పన్నమౌతుంది. ఒకపక్క అధికార వైసీపీ ఇబ్బందులు పెడుతుంటే ఎదుర్కొంటూ, ప్రాధాన్యత లేకుండా పార్టీ ఉండటం అనవసరం అన్న భావన వ్యక్తం అవుతుంది.

లోకేష్ ను పార్టీలో నాయకుడిగా ఎదిగేలా చేయాలన్న చంద్రబాబు ఆలోచన, పార్టీని నాశనం చేస్తుంది అన్న అభిప్రాయం చాలామంది సీనియర్ల వ్యక్తమౌతుంది. చంద్రబాబు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూనే లోకేష్ ని ఎదిగేలా చేయాలని కోరుతున్నారు. పార్టీని నమ్ముకుని అధికార పార్టీతో నిత్య సమరం చేస్తున్న సీనియర్లకు ప్రాధాన్యతనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

బుచ్చయ్య ఆగ్రహానికి, అసహనానికి కారణం ఇదే

బుచ్చయ్య ఆగ్రహానికి, అసహనానికి కారణం ఇదే

రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాలలో బుచ్చయ్య చౌదరికి మంచి పట్టు ఉంది. ఇటీవల అచ్చెన్నాయుడు జోక్యం ఈ రెండు నియోజకవర్గాలలో పెరగడంతో తన పట్టు తగ్గుతుందన్న అభిప్రాయంలో ఉన్నారు బుచ్చయ్య చౌదరి. మరోవైపు పిఎసిఎస్ చైర్మన్ గా తనకు అవకాశం దక్కుతుంది అనుకుంటే అది కూడా లేదని తేలడంతో తీవ్ర అసహనంతో ఉన్న బుచ్చయ్యచౌదరి, పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన తనకు సముచిత స్థానం ఇవ్వకుండా అవమానిస్తున్నారన్న భావన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ పేరుతో పక్కన పెడుతున్నారని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకు బాబు నిర్లిప్తత, లోకేష్ పట్టింపు లేని తనం కారణమని చెప్తున్నారు.

Recommended Video

Bakkani Narsimhulu elected as Party president for tdp in Telangana | Oneindia Telugu
చంద్రబాబు ఇప్పటికైనా రూట్ మార్చాలని విజ్ఞప్తి .. లేదంటే పార్టీలో సీనియర్లు గుడ్ బై చెప్పే స్థితి

చంద్రబాబు ఇప్పటికైనా రూట్ మార్చాలని విజ్ఞప్తి .. లేదంటే పార్టీలో సీనియర్లు గుడ్ బై చెప్పే స్థితి


రాబోయే ఎన్నికల్లో పార్టీ బలపడాలంటే తాజా అసంతృప్తి నేపథ్యంలోనైనా చంద్రబాబు రూట్ మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకపక్క అధికారపార్టీ తీరుతో ఊపిరి సలపని చంద్రబాబుకు, ఇప్పుడు సొంత పార్టీ నేతల తీరు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎప్పుడు ఎవరు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో అంతుచిక్కకుండా ఉంది. పార్టీలో సీనియర్లను సంతృప్తిపరచడానికి ఏం చేయాలో కూడా పాలుపోని స్థితి ప్రస్తుతం టిడిపిలో నెలకొంది.

ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలో పార్టీ నేతల అసంతృప్తి పర్వం బాహాటంగా వ్యక్తమవుతున్న క్రమంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తుంది.

English summary
The Telugu Desam Party is facing a tough situation after losing power in AP. Is Lokesh responsible for the latest situation in TDP? hot topic in AP with Butchaiah episode,Chandrababu is reeling with internal problems in the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X