ఏపీ బీజేపీలో చేరికలను అడ్డుకుంటోన్న పురంధేశ్వరి: ఆడియో లీక్? హైకమాండ్ ఆరా

Purandeshwari: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య కుదిరిన సీట్ల పంపకాల వ్యవహారంపై చెలరేగిన దుమారం.. ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించట్లేదు. రెండు పార్టీల్లో తీవ్ర అసమ్మతి చెలరేగింది. సీట్ల సంఖ్య, అభ్యర్థుల ఎంపిక అసంతృప్త వాతావరణాన్ని రాజేసింది.

టికెట్ దక్కని తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు.. ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూపులు సారిస్తోన్నారు. కాషాయ కండువాను కప్పుకోవడానికి రెడీ అయ్యారు. ఎన్నికల నాటికి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏపీ బీజేపీ నేతలతో సంప్రదింపులు సైతం మొదలు పెట్టారు. అక్కడే అసలు చిక్కొచ్చి పడింది.

Is Purandeshwari blocking the joining in APBJP from TDP and Janasena?

మీ పార్టీలో పని చేస్తాం.. మీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తాం.. ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చూపిద్దాం అని కాస్త ప్రజా బలం ఉన్న నేత ఎవరైనా వస్తే.. ఏ పార్టీ కూడా వదులుకోదు. అంగ, అర్థబలాలున్న నేతలొస్తే రెడ్ కార్పెట్ వేస్తారు. కానీ ఏపీ బీజేపీలో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొంది.

అలా సంప్రదించిన కొందరు టికెట్ రాని, పోటీ రేసులో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలను బుజ్జగించి మరీ వారు ఉన్న పార్టీలోనే ఉండాలని బీజేపీలోకి రావాల్సిన అవసరం లేదని చెబుతారు. కాస్త విచిత్రంగా ఉన్నా ఏపీ బీజేపీలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఇదేం నాయకత్వం అని ఇతర పార్టీల వారు కూడా విస్మయానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

టీడీపీ, జనసేన పొత్తుల కారణంగా చాలా మంది కీలక నేతలకు చోటు దక్కడం లేదు. టీడీపీలో అనేక మంది సీనియర్లకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. అలాగే జనసేన కోసం కష్టపడిన వారు కూడా నిరాశకు గురవుతున్నారు. వారంతా ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీలో చేరాలని అనుకుంటున్నారు. ఇదే ఉద్దేశంతో తమ బలం.. బలగాన్ని ఉపయోగించి బీజేపీని మరితం బలపరుస్తామని చెబుతూ పార్టీలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి మాత్రం.. అసలు వారిని పార్టీలో చేర్చుకునేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించట్లేదు. పైగా వారిని టీడీపీలోనే ఉండాలని ఒత్తిడి చేస్తోన్నారు. అంతే కాదు- అలా తమ పార్టీలో చేరాలనుకుంటోన్న నేతల సమాచారాన్ని సైతం టీడీపీకి అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో బీజేపీని సంప్రదించిన నేతలకు మైండ్ బ్లాంక్ అవుతోంది.

బీజేపీ అధ్యక్షురాలు కూడా టీడీపీ కోసం పని చేస్తున్నారా? ఇదేం పద్దతి? అంటూ వారు చర్చించుకుంటున్నారు. ఈ మద్య ఒంగోలు, నెల్లూరు జిల్లాకు చెందిన ఓ లోక్‌సభ, ఓ రాజ్యసభ చెందిన ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరేందుకు రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించారు. వారిని టీడీపీలో చేరాలని బీజేపీ ముఖ్య నేతగా ఉన్న ఆ పార్టీ బీజేపీ అధ్యక్షురాలే వారికి సూచించారని అంటున్నారు.

దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇలాంటి విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తామే ఈ పార్టీలో చేరి తప్పు చేశామని భావనలో దగ్గుబాటి మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీలో చేరికలు జరగకుండా ఎలా చేయాలనే విషయంపై ఓ జర్నలిస్టుతో మాట్లాడిన ఆడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఆడియో బీజేపీ హైకమాండ్‌ వద్దకు చేరింది. అలాగే బీజేపీ హైకమాండ్‌తో పరిచయాలు ఉన్న వారు మరికొంత మంది నేతలు- పార్టీలో చేరేందుకు ఢిల్లీ పెద్దలనే సంప్రదించారు. రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడమని హైకమాండ్ చెప్పడంతో ఇక్కడ నేతల్ని సంప్రదించడంతో .. పార్టీ మారొద్దని మోటివేట్ చేశారు.

ఇది తేడాగా ఉండటంతో ఆయా నేతలు- ఢిల్లీ పెద్దలకు ఈ విషయాలను చేరవేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసినట్లుగా సమాచారం. వారు చెప్పినవన్నీ నిజమేనని, తమకు తెలిసింది కొంచెమేనని హైకమాండ్‌కు అర్థమయిందని అంటున్నారు. గతంలో ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పజెప్పి నాడు ఎంత తప్పిదం చేశామో.. ఈ సారి కూడా పురందేశ్వరికి బాధ్యతలు ఇచ్చి అంత కంటే ఎక్కువ తప్పిదం చేశామని హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎన్నికల సమయంలో బీజేపీలో చేరడానికి ఏ రాష్ట్రంలో అయినా నేతలు ప్రయత్నిస్తూంటారు. కానీ ఏపీలో ఇటీవలి కాలంలో ఒక రాష్ట్ర స్థాయి ముఖ్య నేత సైతం చేరకపోవడం నేడు పలు అనుమానాలకు తావునిస్తుంది. దీనికి కారణం కూడా హైకమాండ్ కూడా నేడు అర్థమయిందని అంటున్నారు.

Is Purandeshwari blocking the joining in APBJP from TDP and Janasena?

బీజేపీలో చేరేందుకు సిద్ధమయిన వాళ్లను కూడా ఆపేస్తున్నారని స్పష్టమయిందని, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వేతలు చేరుతుంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఎందుకు అలా జరగట్లేదో.. ఈ ఆడియో సంఘటనతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ బీజేపీ వ్యవహారాలపై జాతీయ ముఖ్యులు కూడా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

పురంధేశ్వరి పార్టీని నడుపుతున్నట్లుగా లేదని.. పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం పని చేస్తున్నట్లుగా నిర్ణయాలు ఉంటున్నాయన్న నివేదికను హైకమాండ్ కు కోందరు నేతలు పంపారని అంటున్నారు. పురందేశ్వరి అధ్యక్షరాలిగా అయిన తర్వాత అందర్నీ ఆ పార్టీలో ఉండే సొంత రాజ్యసభ సభ్యులు, ముఖ్యనేతలను సైతం కలుపుకునే ప్రయత్నం చేయడం లేదని సొంత పార్టీ నేతలు అంటున్నారు.

మొత్తంగా ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై బీజేపీ ఆగ్రహంగా ఉంది. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర అధ్యక్షురాలి విషయంలోసంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీలో అంతర్గత చర్చల్లో బిజెపి నేతలు మాట్లాడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది . ఏది ఏమైనా నేడు సొంత పార్టీ నేతల పార్టీకి ఇతర పార్టీల నుంచి రాకుండా అడ్డుకోవడం అనేది ఆ పార్టీలో పెద్ద చర్చనీయాంశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+