చంద్రబాబు స్మార్ట్ పల్స్ సర్వే, తమ్ముళ్ల డౌట్: టిడిపికి నష్టమా?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రజా సాధికార సర్వే పేరిట ప్రజల నుంచి సేకరిస్తున్న వివరాల ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని బొబ్బిలి టిడిపి సమన్వయ కమిటీ తీర్మానం చేసింది. బొబ్బిలిలోనే కాకుండా చాలాచోట్ల ఈ సర్వే పైన కిందిస్థాయి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సర్వే: బాబు నివాసం హైదరాబాదులోనే, ఆస్తులు..

ప్రజా సాధికార సర్వేను ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన విషయం తెలిసిందే. సర్వే పేరిట 88 రకాల వివరాలను అధికారులు అడుగుతున్నారు. వాటిల్లో బ్యాంకు పాస్ పుస్తకాల వివరాల నుంచి గ్యాస్, రేషన్ కనెక్షన్లు, వాహనాలు, పాత కరెంట్ బిల్లులు, ఆధార్, పాన్ నెంబర్ వివరాలు, ఇంటి గురించి, రుణాలు, వాటి కిస్తీలు, పొలం... తదితర పలు అంశాలను అడుగుతున్నారు.

Is TDP cadre unhappy with Chandrababu's Smart Pulse survey?

దీనిపై పేద, మధ్య తరగతి వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. స్వయంగా టిడిపి వారే సర్వేలో పాల్గొని వివరాలు అందించేందుకు ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. సర్వే పైన ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఇది పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చే ప్రమాదం ఉందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారని అంటున్నారు.

స్మార్ట్ పల్స్ సర్వే: 'బాబు సీక్రెట్ అజెండా, వారి చేతుల్లోకి సమాచారం'

ఈ సర్వే తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉందని అంటున్నారు. సర్వేలు వివరాలు అందిస్తే సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు కట్ చేస్తారేమోనని పేద, మధ్య తరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయని, తమ గ్యాస్ సబ్సిడీని తొలగిస్తారేమోనని భయపడుతున్నారని అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Is TDP cadre unhappy with Chandrababu's Smart Pulse survey?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి