'జగన్ క్రిస్టియన్ అని ఇంతకాలం మోసపోయాం, బ్రదర్ అనిల్ ప్రార్థనలు అంటారు కానీ'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న పాదయాత్రలో క్రైస్తవులు ఎవరూ పాల్గొనవద్దని టిడిపి క్రిస్టియన్‌ విభాగం అధ్యక్షులు సెబాస్టియన్‌ పిలుపునిచ్చారు.

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న పాదయాత్రలో క్రైస్తవులు ఎవరూ పాల్గొనవద్దని టిడిపి క్రిస్టియన్‌ విభాగం అధ్యక్షులు సెబాస్టియన్‌ పిలుపునిచ్చారు.

చదవండి: ప్రశాంత్ కిషోర్ సర్వేలపై జగన్, అవసరం లేదు.. సీనియర్ల సూచనకు నో

జగన్ క్రిస్టియన్ అని ఇంతకాలం మోసపోయాం

జగన్ క్రిస్టియన్ అని ఇంతకాలం మోసపోయాం

జగన్‌ క్రైస్తవ వ్యతిరేకి అని సెబాస్టియన్ మండిపడ్డారు. జగన్‌ అసలు హిందువా, క్రైస్తవుడా అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇంతకాలం ఆయన క్రిస్టియన్‌ అని మోసపోయామన్నారు.

చినజీయర్ స్వామి పాదాలు తాకి అవమానించారు

చినజీయర్ స్వామి పాదాలు తాకి అవమానించారు

ఇటీవల జగన్‌ హైదరాబాదులోని శంషాబాద్‌లో చినజీయర్‌స్వామి పాదాలు తాకి ఆశీర్వచనాలు తీసుకోవడం క్రైస్తవ సమాజాన్ని అవమానించడమేనని సెబాస్టియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్రదర్ అనిల్ ఇలా చెబుతున్నారు, కానీ

బ్రదర్ అనిల్ ఇలా చెబుతున్నారు, కానీ

బ్రదర్‌ అనిల్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ప్రార్థన చేయమని చెబుతున్నారని, జగన్‌ మాత్రం చినజీయర్‌ స్వామి చుట్టూ తిరుగుతున్నారని సెబాస్టియన్ వ్యాఖ్యానించారు. జగన్‌ ప్రకటించిన నవరత్నాల్లో క్రిస్టియన్లకు ఒక్క రత్నం కూడా లేదన్నారు.

చంద్రబాబు మాత్రం ఇలా

చంద్రబాబు మాత్రం ఇలా

ముఖ్యమంత్రి చంద్రబాబు క్రైస్తవుల కోసం సంక్షేమ పథకాల అమలు సహా మంత్రి పదవులను ఇచ్చి వారికి అండగా ఉంటున్నారని సెబాస్టియన్ అన్నారు.

రేవంత్ పార్టీ మారటంపై ఏ2 నిందితుడు

రేవంత్ పార్టీ మారటంపై ఏ2 నిందితుడు

తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి పార్టీ మారటం ఆయన వ్యక్తిగత విషయమని, తాను మాత్రం పార్టీలోనే కొనసాగుతానని సెబాస్టియన్‌ చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసు పెట్టి ఏ2 నిందితుడిగా చేర్చటం ఆవేదనగా ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్ నిందితుడుగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+