జగన్‌కు షాక్: వైయస్ వివేకానంద రెడ్డి అసంతృప్తి, కారణం అదేనా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి అసంతృప్తితో ఉన్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన బాబాయి, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి అసంతృప్తితో ఉన్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

వైయస్ వివేకానంద రెడ్డి
వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందిన కొన్నాళ్లకు వైయస్ జగన్ పార్టీ పెట్టారు. కానీ వైయస్ వివేకానంద మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. అంతేకాదు, ఆ తర్వాత ఉప ఎన్నికలలోను వైయస్ కుటుంబ సభ్యులపై పోటీ చేసి ఓడిపోయారు. తొలుత జగన్‌కు దూరంగా ఉన్న వివేకా.. ఆ తర్వాత దగ్గరయ్యారు. వైసిపిలో చేరారు.

జగన్ హామీ ఇచ్చారా?
అయితే, ప్రస్తుతం ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంతృప్తిగా లేరనే ప్రచారం సాగుతోంది. అందుకు జగన్ తీరు కారణమని అంటున్నారు. 2019 ఎన్నికల్లో కడప టిక్కెట్ కావాలని వైయస్ వివేకా అడగ్గా.. అప్పుడు జగన్ అంగీకరించారని అంటున్నారు. కానీ ఇప్పుడు అది నెరవేరేలా లేదని, దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు.

అవినాశ్ రెడ్డిస్థానంలో వైయస్ వివేకా
ప్రస్తుతం కడప ఎంపీగా అవినాశ్ రెడ్డి ఉన్నారు. 2019లో ఆయనను మరో శాసన సభ నియోజకవర్గానికి పంపించి, వైయస్ వివేకానంద రెడ్డికి కడప లోకసభ టిక్కెట్ ఇవ్వాలని భావించారట.

వివేకానంద అసంతృప్తితో ఉన్నారా?
అయితే, అవినాస్ రెడ్డిని కడప నుంచి కదపవద్దని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. దీనిని వైయస్ వివేకానంద రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన జగన్ పైన అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications