టీడీపీ, వైసీపీ, జనసేనలో క్రాస్ ఓటింగ్ గుబులు, ఎవడికైనా వేసుకో, అయితే ఇక్కడే లాజిక్ !!
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల పోలింగ్ తేదీ ఒకే రోజు కావడంతో రాష్ట్రంలో ఒకేసారి డబుల్ ఢమాకా వచ్చిపడింది. కొన్ని ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు, లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులు వేర్వేరు పార్టీలు, వేర్వేరు వర్గాల నాయకులు కావడంతో ఆయా నియోజక వర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైసీపీ నాయకులు పోటీ చేస్తున్నారు. అదే 175 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ నియోజక వర్గాల్లో సీట్ల పంపకాల్లో తేడాలు రావడంతో పలు నియోజక వర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల మధ్య ఇంకా హామీల సర్దుబాటు, లావాదేవీల సర్దుబాటులు కావడం లేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

సింహం సింగిల్ గా వస్తుంది, పందులే గుంపులు గుంపులుగా వస్తాయని పలు నియోజక వర్గాల్లో వైసీపీ నాయకులు రజనీకాంత్ డైలాగులు వాడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ఇంటికి పంపించడం టార్గెట్ గా పెట్టుకున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బీజేపీ నాయకులు వైసీపీ నాయకుల ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ నియోజక వర్గాల్లో వైసీపీ నాయకులు పోటీ చేస్తున్నారు. అదే లోక్ సభ నియోజక వర్గాలను పంచుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పోటీ చేస్తున్నారు. ఇక్కడే అసలు మ్యాటర్ లో తేడా వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో టిక్కెట్లు ఆశించి చివరి నిమిషంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు దక్కకపోవడంతో కొందరు నాయకులు ఇంకా అసహనంతో ఉన్నారని తెలిసింది. ఇలాంటి కొందరు నాయకులు ఇప్పుడు సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారని తెలిసింది.

ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేస్తున్న నాయకుల్లో మీకు ఎవరు నిచ్చితే వాళ్లకు ఓటు వెయ్యండి కొన్ని ప్రాంతాల్లో నాయకులు కార్యకర్తలకు చెబుతున్నారని తెలిసింది. నాయకులే ఇలా చెబుతుంటే కొన్ని లోక్ సభ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులకు గుండెల్లో గుబులు మొదలైయ్యిందని తెలిసింది. ఆ నియోజక వర్గాల్లో సొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచినా మనకు బొక్కపడే అవకాశం ఉందని గుర్తించిన ఎంపీ అభ్యర్థులు ఇప్పుడు లబోదిబో అంటున్నారని తెలిసింది.
సొంత పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేసి ఎంపీ అభ్యర్థి విషయంలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడే అవకాశం ఉందని వెలుగు చూసింది. మా విషయంలో క్రాస్ ఓటింగ్ జరగదు అని అన్ని పార్టీ నాయకులు ధీమాగా చెబుతున్నా లోపల మాత్రం చాలా మందికి భయం పట్టుకుందని తెలిసింది. అయితే పలు నియోజక వర్గాల్లోని ప్రజలు మాత్రం మేము ఫలానా ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేసినా వేరే పార్టీ ఎంపీ అభ్యర్థికి ఓటు వేస్తామని బహిరంగంగానే చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications