విశాఖ కు మరో గుడ్ న్యూస్ - మారుతున్న రూపురేఖలు..!!
విశాఖ నగరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కొంత కాలంగా విశాఖ కేంద్రంగా పలు కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కేంద్రం నీతిఅయోగ్ గ్రోత్ సిటీస్ జాబితాలో విశాఖను చేర్చింది. డిసెంబర్ లో విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. నాలుగు రోజుల క్రితం విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు సాగర తీరాన మరో ఐటీ దిగ్గజ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
విశాఖ కేంద్రంగా
ఏపీలో విశాఖ ఐటీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. పలు ప్రముఖ ఐటీ సంస్థలు తమ శాఖలను విశాఖలో విస్తరిస్తున్నాయి. తాజాగా విప్రో విశాఖలో ఉన్న ఉన్న ప్రస్తుత కార్యాలయాన్ని విస్తరిస్తున్నట్టు ఆ సంస్థ 'ప్రాజెక్ట్ లావెండర్' పేరు తో ప్రకటించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్లలో విశాఖ వెళ్లేందుకు ఉన్న ఉద్యోగుల వివరాల్ని ఈ మెయిల్స్ ద్వారా సేకరించే పనిలో విప్రో నిమగ్నమైంది. ఈ ఏడాది చివరి నాటికి సంస్థను 1000 సీట్లకు విస్తరించే విషయంపై ఇప్పటికే సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం, ఎపిటా జరిపిన చర్చల్లో విప్రో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

విప్రో సంస్థ లేఖలు
అంతర్జాతీయంగా పేరొందిన ఐటీ, అనుబంధ సంస్థలు టైర్-2 సిటీల వైపు చూస్తున్నాయి. టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్‌ఎస్ మొదలైన ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులేస్తున్నాయి. ఈ నెల 16న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తాజాగా విప్రో కూడా అదే బాటలో విశాఖలో విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. విశాఖలో కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా తమ డెవలప్‌మెంట్ సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న వారికి విప్రో సంస్థ లేఖలు రాసింది. విశాఖ కేంద్రంగా పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి వివరాలు సేకరిస్తోంది. ఈ తరుణంలో తాజాగా విశాఖలో డేటా సెంటర్ విస్తరిస్తున్నట్టు ప్రకటించింది.

సాగర తీరాన ఐటీ విస్తరణ
వృద్ధి చెందుతున్న నగరాల్లో తమ సంస్థ డెవలప్‌మెంట్ సెంటర్‌ను విస్తరించేందుకు ప్రాజెక్ట్ లావెండర్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా తొలి అడుగు విశాఖలో వేస్తున్నట్టు విప్రో స్పష్టం చేసింది. నగరంలోని సత్యం జంక్షన్‌లో వైఎస్సార్ హయాంలో 2006 మేలో విప్రో క్యాంపస్‌కు ఏడెకరాల స్థలాన్ని కేటాయించారు. అనంతరం మూడున్నరేళ్ల తర్వాత విప్రో తన కార్యకలాపాల్ని ప్రారంభించింది.వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(వీడీఐ), క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్‌ను మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే వీడీఐ ప్రాజెక్టులతో కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పటికే 1000 మందికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications