నారసింహం vs నారాసింహం
TDP Janasena BJP alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష తెలుగుదేశం.. మరోసారి కూటమి కట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి జనసేన- భారతీయ జనతా పార్టీలను ఆశ్రయించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలోనూ చేరింది.
కూటమి మధ్య సీట్ల పంపకాల వ్యవహారం పూర్తిస్థాయిలో కొలిక్కి రావట్లేదు. తెలుగుదేశం పార్టీ అయిదు మినహా మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేనలో కూడా సీట్ల కేటాయింపు దాదాపుగా ముగిసినప్పటికీ- తుది జాబితా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. బీజేపీ జాబితా ఈ సాయంత్రానికి వెలువడొచ్చు.

ఈ పొత్తుపై తాజాగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఏపీ బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మోనార్క్‌గా అభివర్ణిస్తూ చంద్రబాబు అనుకూల మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. ప్రత్యేకించి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి ఆయన చురకలు అంటించారు. ఆయన వైఖరిని ఐవైఆర్ కృష్ణారావు తప్పుపట్టారు.
ప్రధాని మోదీని పెనుభూతంగా వర్ణించడం సరికాదని పేర్కొన్నారు ఐవైఆర్. ఒకరి వ్యక్తిని మరీ ఇంతగా ద్వేషించాల్సిన అవసరం లేదని చెప్పారు. చిన్నాచితక హిరణ్యకశిపులను సంహరించటానికి పని చేస్తున్ననారా సింహం, పెనుభూతం అన్న ప్రతి చోటా నారసింహం అని అన్వయించుకుంటే సరిపోతుందని సూచించారు.
అనుకూల మీడియా శ్రేయోభిలాషులుగా చెప్పుకొంటోన్న ఇలాంటి వారి నుంచి చంద్రబాబు ఎంత త్వరగా దూరం జరిగితే అంత మేలు అని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి శ్రేయోభిలాషులు ఉంటే చంద్రబాబుకు ఇక ప్రత్యేకంగా శతృవుల అవసరం లేదని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications