ఇంత దారుణమా!: చంద్రబాబుపై మరోసారి ఐవైఆర్ కృష్ణారావు నిప్పులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మరోసారి నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా ఆయన ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు.
Recommended Video

గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చిన రెండు కులాలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేకుండా పోయిందని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే బ్రాహ్మణ, కాపు కార్పోరేషన్లపై నిర్లక్ష్యం వహించరన్నారు.

ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్‌కు ఐఏఐస్ అధికారి పద్మను నియమించకముందు ఆరు నెలల పాటు బ్రాహ్మణ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లేరని గుర్తు చేశారు. ఆమెను అక్కడి నుంచి బదలీ చేసి, ఆ శాఖ బాధ్యతలు ఆమెనే (ఇంచార్జ్) చూసుకొమ్మని చెప్పారన, ఇది సరైనదేనా అన్నారు.
అలాగే రూ.1000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే కాపు కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కనీసం ఏఐఎస్ అధికారిని కూడా నియమించలేదన్నారు. జాయింట్ డారెక్టర్ స్థాయి అధికారికి ఆ బాధ్యతలు ఇచ్చారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications