వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి మాట్లాడితే తాట తీస్తా
తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు ఎంపీగా పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య, కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డిపై ప్రత్యర్థి పార్టీకి చెందినవారు ట్రోలింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రశాంతిరెడ్డి తాజాగా భావోద్వేగానికి గురయ్యారు. దీనిపై జబర్దస్త్ మాజీ కమెడియన్, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు యజమాని కిరాక్ ఆర్పీ స్పందించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, హుందాతనంతో రాజకీయాలు చేసే ఆయన్ను పోగొట్టుకోవడం వైసీపీ దౌర్భాగ్యమన్నారు.
వేమిరెడ్డి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడటం తనకు ఎంతో బాధగా ఉందని, ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించాలంటూ తన భార్య ప్రెస్ మీట్ కు పంపించిందని వెల్లడించారు. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తరఫున ప్రచారం చేస్తానన్నారు. నెల్లూరు రాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా ఎందుకు మహిళలను టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. కోవూరులో ప్రశాంతిరెడ్డి గెలవడం ఖాయమని, ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలతోనే అది అర్థమైందన్నారు. నెల్లూరు నుంచి వేమిరెడ్డి రెండు లక్షల మెజారిటీతో గెలవబోతున్నారన్నారు.

వేమిరెడ్డికి షుగరు ఉందని ప్రసన్నకుమార్ రెడ్డి చీప్ గా మాట్లాడారని, ఈరోజుల్లో చిన్న పిల్లలకు కూడా షుగరు వస్తోందన్నారు. వేమిరెడ్డి కుటుంబం గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని, తాను కూడా రంగంలోకి దిగి ఒక్కొక్కరి తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా తప్పు చేస్తే మాట్లాడాలికానీ వ్యక్తిగత విషయాల గురించి ఎందుకు అని ప్రశ్నించారు. తాను కోవూరు వస్తున్నానని, ఎవరు ఆపుతారో చూద్దామని ఆపండంటూ సవాల్ విసిరారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని, అతనికి ఎంత దమ్ముందో తనకు కూడా అంతే దమ్ము ఉందన్నారు. లైవ్ లో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అనిల్ కుమార్ చర్చకు వస్తారా? అంటూ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications