వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ హామీలు బాబు అమ‌లు చేస్తున్నారా, క‌్రెడిట్ ఎవ‌రికి ద‌క్కేను: వీరిద్ద‌రి మ‌ధ్య మ‌రి ప‌వ‌న్‌..!

|
Google Oneindia TeluguNews

ఏపి రాజ‌కీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నిక‌ల షెడ్యూల్ కు స‌మయం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టం తో అధికార పార్టీలో హ‌డావుడి మొద‌లైంది. సుదీర్ఘ పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ప్ర‌జాక‌ర్ష‌క వ‌రాల‌ను అధికా రంలో ఉండ‌గానే అమ‌లు చేసి జ‌గ‌న్ కు ఛాన్స్ ఇవ్వ‌కూడ‌ద‌ని ముఖ్య‌మంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగా నే..పెన్ష‌న్ల‌ను పెంచిన చంద్ర‌బాబు...ఇత‌ర ప్ర‌క‌ట‌న పైనా దృష్టి పెట్టారు. మ‌రి..రాజ‌కీయంగా చూస్తే ప్ర‌క‌టించిన వారికి క్రెడిట్ ద‌క్కుతుందా..లేక అమ‌లు చేస్తున్న వారికి ద‌క్కుతుందా..మ‌రి వీరి మ‌ద్య లో ప‌వ‌న్ ప‌రిస్థితి ఏంటి..

జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.. బాబు అమ‌లు చేస్తున్నారు..

జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.. బాబు అమ‌లు చేస్తున్నారు..

ఏపిలో కొత్త త‌ర‌హా రాజ‌కీయాలు మొద‌లయ్యాయి. పార్టీ ప్లీన‌రీ స‌మ‌యంలో వైసిపి అధినేత జ‌గ‌న్ వచ్చే ఎన్నిక‌ల కోసం న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌క‌టించారు. పాద‌యాత్ర లో వీటికి విస్తృత ప్ర‌చారం క‌ల్పించారు. ఎన్నిక‌ల్లో వైసిపి ప్ర‌చారాస్త్రాలుగా న‌వ‌ర‌త్నాలు మారుతున్నాయి. ఇదే స‌మయంలో జ‌గ‌న్ ఇస్తున్న హామీల‌కు దేశ బడ్జెట్ ఖ‌ర్చె చేయాల‌ని ఆరోపించిన టిడిపి నేత‌లు..ఇప్పుడు ఆ ప్ర‌క‌ట‌న‌ల‌నే అమ‌లు చేస్తున్నారు. జ‌గ‌న్ ఏడాదిన్నార క్రితం పెన్ష‌ర్ రెట్టింపు చేస్తాన‌ని.. అధికారంలోకి రాగానే అమ‌లు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇది ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్లింది. దీంతో..చంద్ర‌బాబు త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేస్తాన‌ని చెబుతున్న జ‌గ‌న్ కంటే..అధికారంలో ఉన్న తాను అమ‌లు చేసేస్తే..ఇక జ‌గ‌న్ కు అవ‌కాశం ఉండ‌ద‌ని..ప్ర‌జ‌లు త‌న‌తోనే ఉంటార‌ని ఓ అంచనాకు వ‌చ్చారు. అంతే, రాష్ట్ర అర్దిక ప‌రిస్థితులు స‌హ‌క‌రించుకున్నా..త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌చ్చేలా పెన్ష‌న్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణ‌యం తీసుకు న్నారు. ఫ‌లితంగా 54 ల‌క్ష‌ల మంది పై ప్ర‌త్య‌క్షంగా ప్ర‌భావం చూప‌నుంది.

ప్ర‌కట‌న‌ల‌కా..అమ‌లుకా..క్రెడిట్ ఎవ‌రికి..

ప్ర‌కట‌న‌ల‌కా..అమ‌లుకా..క్రెడిట్ ఎవ‌రికి..

జ‌గ‌న్ న‌వ‌రత్నాల్లో ప్ర‌ధానంగా పెన్ష‌న్లు..రైతుల‌కు ల‌బ్ది..డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఆర్దిక వెసులుబాటు ప్ర‌ధాన‌మైన‌వి. జ‌గ‌న్ చేసిన ఈ ప్ర‌క‌ట‌న పై ముఖ్య‌మంత్రి అనేక కోణాల్లో ప్ర‌జాభిప్రాయం సేక‌రించేందుకు స‌ర్వేలు చేయించారు. అందులో ఈ మూడు అంశాలు ప్ర‌జ‌ల్లోకి బాగా వెళ్లాయ‌ని ఫీడ్‌బ్యాక్ వ‌చ్చింది. అంతే, అందులో మొద‌ట‌గా పెన్ష‌న్ల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక, గ‌త ఎన్నిక‌ల హామీల్లో భాగంగా డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ మాఫీ ప్ర‌క‌టించినా..ఒక్కో మ‌హి ళ‌కు ప‌దివేల రూపాయాల ఆర్దిక వెసులుబాటు మాత్ర‌మే ఇచ్చారు. ఇప్పుడు జ‌గ‌న్ నిర్ణ‌యానికి ధీటుగా..అధికారంలో ఉ న్న స‌మ‌యంలోనే ప్ర‌తీ డ్వాక్రా మ‌హిళ‌కు మ‌రో ప‌ది వేలు చొప్పున ఆర్దిక ప్ర‌యోజ‌నం క‌లిగించేలా క‌స‌ర‌త్తు జ‌రుగు తోంది. ఇక‌, రైత‌లు విష‌యంలో జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌కు ధీటుగా..ప్ర‌స్తుతం పెండింగ్‌లో ఉన్న రుణ మాఫీ ప్ర‌క్రియ‌ను ఈ నెలాఖ‌రులోగా పూర్తి చేసి..తెలంగాణ త‌ర‌హాలో రైతు బందు స్కీం అమ‌లు కు ప్లాన్ చేస్తున్నారు. జ‌గ‌న్ హ‌మీల‌ను ముందుగానే అమ‌లు చేస్తున్న చంద్ర‌బాబు ఖ‌చ్చితంగా ఆ క్రెడిట్ త‌న‌కే ద‌క్కుతుంద‌నే భావ‌న‌లో ఉన్నారు. ప్ర‌యోజ నాలు అందుకున్న వారు త‌మ‌తోనే ఉంటార‌నే అంచ‌నాతో ఉన్నారు.

జ‌గ‌న్ హామీలు..బాబు ఆచ‌ర‌ణ‌..మ‌రి ప‌వ‌న్‌...!

జ‌గ‌న్ హామీలు..బాబు ఆచ‌ర‌ణ‌..మ‌రి ప‌వ‌న్‌...!

జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాలు ప్ర‌క‌టించారు. అందులో కీల‌క‌మైన‌వి అమ‌లు దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య క్రెడిట్ గేమ్ మొద‌లైంది. జ‌గ‌న్ కు చెప్పుకొనే అవ‌కాశం లేకుండా చేస్తామ‌ని టిడిపి..త‌మ‌ను హామీల‌ను బాబు అమ‌లు చేస్తున్నార‌ని ఆ క్రెడిట్ త‌మ‌కే ద‌క్కుతుంద‌ని వైసిపి చెబుతోంది. ఈ ఇద్ద‌రి ప‌రిస్థితి ఇలా ఉంటే మ‌రి జ‌న‌సే న అధినేత ప‌వ‌న్ ఏం చెబుతారు. ప్ర‌జ‌ల్లోకి ఆయ‌న ఏ అజెండాతో వెళ్తారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ లెక్క‌లేన‌న్ని హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను ఆకట్లుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక‌, అధికారంలో ఉన్న చంద్ర‌బాబు ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్న ప‌ధ కాల‌తో పాటుగా కొత్త‌వి అమ‌ల్లోకి తెస్తూ జ‌గ‌న్ కు చెక్ పెడుతున్నారు. మ‌రి..సంక్షేమం - అభివృద్ది పై ప‌వ‌న్ ఇప్ప‌టి దాకా ఎటువంటి హామీలు..త‌న ఆలోచ‌న‌ల‌ను బ‌ట‌య పెట్టలేదు. ఎన్నిక‌ల స‌మ‌యం స‌మీపిస్తున్న వేళ‌.. ఆ ఇద్ద‌రూ ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి..వీటికి భిన్నంగా హామీలు గుప్పిస్తారా..లేక కొత్త త‌ర‌హా ప‌ధ‌కాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకొస్తారా అనే చ‌ర్చ సాగుతోంది. దీంతో..ఇప్పుడు ప‌ధ‌కాలు..వ‌రాల‌తోనే ప్ర‌జ‌ల‌ను ఆక ట్టుకోవ‌టానికి ఏపిలో పార్టీల అధినేత‌లు చేస్తున్న ప్ర‌యత్నాల్లో ఎవ‌రికి ప్ర‌యోజ‌నం దక్కుతుందో చూడాలి.

English summary
AP C.M Chandra babu announced Pension hike. Ycp chief jagan announced Navaratnalu last year to attract people in Ap. Now, that schemes also implementing by present ap govt. So, Who will get Credit..discussion start in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X