చంద్రబాబు విమానాల్లో తిరుగుతున్నారు
గుంటూరు: భారీ వర్షాలకు పత్తి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వైసిపి అధినేత జగన్ అన్నారు. ఆయన గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక్కడ పంట నష్టంతో బాధపడుతుంటే చంద్రబాబు విమానాల్లో తిరుగుతున్నారన్నారు. రుణాలు లేక రైతులు ఇబ్బంది పడుతుందని చెప్పారు. రెండు మూడు రూపాయల మిత్తికి రైతులు అప్పు తెచ్చుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications