జగన్ కేసు: మోపిదేవి లొంగుబాటు, బెయిల్ పిటిషన్

మాజీ మంత్రి మోపిదేవికి సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 31వ తేదీ వరకు రిమాండ్ విధించింది. మోపిదేవి వెంకటరమణ ఇదే సమయంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి (శుక్రవారంనాటికి) వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని ఆదేశించింది.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో తొలుత అరెస్టయింది మోపిదేవి వెంకటరమణనే. అరెస్టు కావడంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఆయన మే 24వ తేదీన అరెస్టయ్యారు. అంతకు ముందు రోజు ఏడు గంటల పాటు విచారించిన సిబిఐ అధికారులు మర్నాడు అరెస్టు చేశారు.
మోపిదేవి వెంకటరమణ ఆరోగ్యం చంచల్‌గుడా జైలులో ఉన్న సమయంలో పూర్తిగా క్షీణించడంతో కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications