• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ ఎఫెక్ట్ .. హైదరాబాద్ లో రియల్ మార్కెట్ ఫుల్ .. అమరావతిలో రియల్ ఎస్టేట్ డల్

|

ఏపి సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుణ్యమాని తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి విజయం సాధించిన తరువాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపందుకుంది . ఫలితాల రోజు మే 23 తర్వాత నుండి, హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్,ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనం కారణంగా భారీగా పెరిగింది.

ఏపీ రాజధానిపై నీలి నీడల ఎఫెక్ట్ .. ఏపీలో పడిపోయిన రియల్ ఎస్టేట్

ఏపీ రాజధానిపై నీలి నీడల ఎఫెక్ట్ .. ఏపీలో పడిపోయిన రియల్ ఎస్టేట్

ఇప్పుడు ఏపీలో రాజధాని అమరావతి పై రకరకాల పుకార్లు షికార్లు చేయటం , సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని అభివృద్ధి పనులను నిలుపుదల చేయించటం దెబ్బ రియల్ ఎస్టేట్ మీద బాగానే పడింది. అలాగే సెక్రటేరియట్ ను మారుస్తున్నారని, అంతేకాదు రాజధాని పేరు మార్పు కూడా చేయనున్నారు అని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో రాజధాని పరిసర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ పై తాజా పరిణామాలు ప్రభావం చూపిస్తున్నాయి. రాజధాని అమరావతి.. ఎప్పుడైతే ఏపీ రాజధాని అమరావతిగా మారిందో వెలగపూడి సమీపంలోని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ ఒక్కసారి భూం అందుకుంది. భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వేలకోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. పంట పొలాలని కొనుగోలు చేసిన రియల్టర్లు పెద్ద ఎత్తున తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరిగింది.ఇక చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతిని చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రహ్మాండంగా తమ వ్యాపారం కొనసాగించారు.

జగన్ అధికారంలోకి రావటం, తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం .. రియల్ ఎస్టేట్ మార్కెట్ కు దెబ్బ

జగన్ అధికారంలోకి రావటం, తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం .. రియల్ ఎస్టేట్ మార్కెట్ కు దెబ్బ

ప్రస్తుతం వైసిపి అధికారంలోకి రావడంతో జగన్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు , కూల్చివేత నిర్ణయాలు అక్కడ రియల్ ఎస్టేట్ మీద చాలా దారుణమయిన ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, రాజధాని నిర్మాణం విషయంలో అవినీతి జరిగిందంటూ బయటకు తీస్తామంటూ సాగుతున్న చర్చతో రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవుతోంది. అమరావతిలో చాలా అస్పష్టత ఉన్నందున, ఏపి విషయానికి వస్తే కొనుగోలుదారులు మరియు పెట్టుబడిదారులకు భవిష్యత్ ఎలా ఉంటుందో అని ఎవరి భయాలు వారికి ఉన్నాయి.

తాజా పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్న తెలంగాణా రియల్టర్లు .. హైదరాబాద్ లో రియల్ బూమ్

తాజా పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్న తెలంగాణా రియల్టర్లు .. హైదరాబాద్ లో రియల్ బూమ్

అందువల్ల, చాలా మంది పెట్టుబడిదారులు హైదరాబాద్ మరియు పరిసరాల్లో ఆస్తులను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. మరియు కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు అమరావతి విషయానికి వస్తే వెయిట్ అండ్ వాచ్ పాలసీని అనుసరిస్తున్నారు. వారు ఏపీలో పరిస్థితి మారటానికి ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు పట్టొచ్చని భావిస్తున్నారు. మరియు అప్పటి ఉన్న పరిస్థితిని బట్టి, రియల్టర్లు ఏపీ లో ఆస్తులను కొనాలా వద్దా అని నిర్ణయం తీసుకోనున్నారు .హైదరాబాద్లోని రియల్టర్లు ఏపీలోని తాజా పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్నారు. రాజధాని నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ నేపధ్యంలో రియల్టర్లకు భారీ షాక్.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Thanks to AP CM YS Jagan Mohan Reddy, the real estate market in Telangana's capital city Hyderabad is booming. As per real estate experts, the real estate market in Hyderabad has picked momentum after YCP emerged victorious in Assembly elections in Andhra Pradesh. Since May 23, the results day, the real-estate market in Hyderabad has seen huge surge owing to the downfall of the real-estate market in Amaravati, AP's capital.As there is a lot of ambiguity in Amaravati with the formation of new government and CM Jagan's aggressive decisions related to policy and politics, potential buyers and investors have their own apprehensions when it comes to AP. Hence, many of investors are looking to buy properties in and around Hyderabad. And the buyers, investors are adopting a wait and watch policy when it comes to Amaravati. They want to take an year or two years before things get settle down in AP and depending on then prevailing condition, the realtors could take a call whether to buy properties or not in AP.This is indeed a tricky situation to realtors who started constructions in AP as the sales have drastically come down. Both inquiries and closures have come down in AP, confirmed a realtor. Meanwhile, the realtors in Hyderabad are cashing in on the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more