మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్రను ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన సీఎం జగన్..రెండో రోజు బస్సు యాత్రను ఆళ్లగడ్డ నుంచి ప్రారంభించారు. ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకున్న సీఎం జగన్ అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు.. వైసీపీ ప్రభుత్వ పనితీరు గురించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారాయన.
ఇక జగన్ బస్సు యాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం బత్తునూరు వద్ద అటుగా వస్తున్న అంబులెన్స్‌ను గమనించిన జగన్ ఆ వాహనం వెళ్లడానికి దారి ఇచ్చారు. పెద్ద ఎత్తున జనం ఉన్నప్పటికీ.. అంబులెన్స్ సజావుగా వెళ్లేలా జగన్ సిబ్బందికి సూచనలిచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో కూడా చాలాసార్లు అంబులెన్స్‌కు దారి ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారాయన.

ఇక ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత దూసుకుపోతున్నారు.మేమంతా సిద్దం అనే పేరుతో వైసీపీ అధినేత బుస్సు యాత్ర చేపట్టిన సంగతి అందరికి తెలిసింది. ప్రొద్దుటూరులో తొలి ఎన్నికల సభ నిర్వహించిన జగన్..గురువారం నంద్యాలలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.సాయంత్రం నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో జగన్ మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు. జగన్ పర్యటనలో పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరడం జరిగింది.












Click it and Unblock the Notifications