10.10 దాటితే అంతే, మూడుసార్లే ఛాన్స్.. జీతంలో కోత, జగన్ సర్కార్ కీ డిసిషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమ, నిబంధనలను మరింత కఠిన చేస్తోంది. ప్రత్యేకించి ఉద్యోగుల విషయంలో తగ్గడం లేదు. పీఆర్సీ గురించి ఉద్యోగ సంఘాల నేతలు కోపంతో ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఉద్యోగుల పనివేళలపై జగన్ సర్కార్ కండీషన్స్ విధిస్తోంది. ఒకవేళ నిర్దేశిత సమయం దాటితే.. సెలవుగానే పరిగణిస్తామని చెబుతోంది. ఇందులో సందేహానికి తావులేదని తేల్చిచెప్పింది.

ఇప్పుడు మరో సమస్య..
అయితే పీఆర్సీ విషయంలో ఏపీ సర్కారు తీరుతో ఉద్యోగులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ సమస్య ఏదో అలా అయిపోయిందని మనసు పెద్దది చేసుకున్నారు. సరే అని ముందడుగు వేస్తున్నారు. ఉద్యోగులకు మరో షాకి ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాల్సిందేనని కుండబద్దలు కొట్టీ మరీ చెప్పింది. ఇకపై ఆలస్యంగా విధులకు వస్తే.. ఆ రోజున లీవ్ పెట్టినట్టుగానే పరిగణించాల్సి వస్తుందని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగులు ఏం జరుగుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు.

10 నిమిషాలు ఛాన్స్.. ఆపై వస్తే
ఆదేశాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఉదయం 10 గంటలకు కార్యాలయాలకు రావాల్సిన ఉద్యోగులు ఓ 10నిమిషాల వరకు లేటయితే ఓకే.. కానీ అంతకు ఒక్క నిమిషం లేటయినా సెలవు పడిపోతుంది. 10.10 గంటల నుంచి 11 గంటల మధ్యలో కార్యాలయానికి వచ్చేందుకు నెలకు మూడు పర్యాయాలు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టంచేసింది. ఆ పరిమితి దాటేతే ఇక వేతనంలో కోత మొదలైపోతుందని తెలిసింది. ఈ మేరకు ఏపీ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై ఇప్పుడు ఏపీ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

3 సార్లు ఛాన్స్ అట
దాదాపు చాలా మంది సమయానికి రారు. ఏదో అలా గడిపేస్తారు. కానీ ప్రభుత్వ నిర్ణయంతో వారికి బాధలు తప్పేలా లేవు.. ఓ మూడుసార్లు అవకాశం ఇచ్చి.. తర్వాత సెలవుగా చూస్తారు. జీతంలో కోత షురూ అవుతుంది. అంటే వారు పనిచేసిన చేయనట్టే లెక్క. ఒకవేళ లీవులు ఉన్నవారు.. అందులో వెళతాయి. అలా సెలవు లేనివారికి మాత్రం శాలరీలో బొక్క తప్పదు. అసలే పీఆర్సీ, ఇంక్రిమెంట్ లేదని గగ్గోలు పెడుతున్న ఉద్యోగులు.. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నోరెళ్లబెడుతున్నారు. ఇదేం పని అంటూ విరుచుకుపడుతున్నారు. తీరు మార్చుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications