Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మొన్న మాన్సాస్ ట్రస్ట్ ; ఇప్పుడు ధూళిపాళ్ళ ట్రస్ట్ : జగన్ సర్కార్ ఫోకస్, ధూళిపాళ్ళ నరేంద్రకు మరో షాక్ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి నేతలకు వైసీపీ సర్కార్ చెమటలు పట్టిస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తున్న పరిశ్రమలు, సంస్థలు, వివిధ ట్రస్టులపై ఫోకస్ పెట్టింది. ఎక్కడ ఏ మాత్రం నిబంధనల ఉల్లంఘన జరిగినా ఉక్కు పాదం మోపే ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా అవినీతి అక్రమాలపై మైక్రో లెవెల్ లో పరిశీలన చేస్తోంది. దీంతో టిడిపి నేతలకు కంటిమీద కునుకు లేని పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతల సంస్థలు, వ్యాపారాలపై టార్గెట్ చేస్తున్న తీరు వైసీపీ కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

 టార్గెట్ టీడీపీ అంటున్న వైసీపీ ప్రభుత్వం .. కీలక నేతలకు చుక్కలు

టార్గెట్ టీడీపీ అంటున్న వైసీపీ ప్రభుత్వం .. కీలక నేతలకు చుక్కలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టార్గెట్ టీడీపీ అంటోంది. టిడిపి నేతలు గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో చేసిన ఆర్థిక నేరాలను బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. రాజధాని అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని పెద్ద ఎత్తున విచారణకు ఆదేశించి, నేటికీ అమరావతి భూములపై విచారణ కొనసాగిస్తుంది. ఆ తర్వాత ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని, అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేసి ఆయనకు నరకం చూపించింది. ఇక విశాఖలో భూ అక్రమాలు జరిగాయని గంటా శ్రీనివాసరావు ని టార్గెట్ చేసి, గంటా శ్రీనివాసరావు రాజకీయాలకు దూరంగా ఉండేలా చేసింది.

 లెక్కకు మించి కేసులు .. టీడీపీ నేతల పడరాని పాట్లు

లెక్కకు మించి కేసులు .. టీడీపీ నేతల పడరాని పాట్లు

మంత్రి నారాయణ నిబంధనలకు విరుద్ధంగా కళాశాల నిర్వహిస్తున్నారని, నారాయణ కళాశాలలపై ఉక్కుపాదం మోపి నారాయణ సైలెంట్ అయ్యేలా చేసింది. అనంతపురం రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన జెసి దివాకర్ రెడ్డి, జేసీ ట్రావెల్స్ లో అవినీతి అక్రమాలపై కేసులు నమోదు చేసి ఉక్కిరిబిక్కిరి చేసి జెసి దివాకర్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండేలా చేసింది. ఇక తాజాగా ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించిన అమరరాజా బ్యాటరీస్ సంస్థ పర్యావరణ నిబంధనలు పాటించటం లేదని నోటీసులు జారీ చేసి చిత్తూరు జిల్లాలోని ప్లాంట్లు మూసెయ్యాలని సూచించింది . ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కీలక నేతలు ఎందరో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

మాన్సాస్ ట్రస్ట్ పై ఫోకస్ పెట్టిన జగన్ సర్కార్ .. అశోక్ గజపతి రాజుకు చుక్కలు

మాన్సాస్ ట్రస్ట్ పై ఫోకస్ పెట్టిన జగన్ సర్కార్ .. అశోక్ గజపతి రాజుకు చుక్కలు

ఇదిలా ఉంటే మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేస్తూ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు ను తొలగించి, ఆ స్థానంలో సంచైత గజపతిరాజును కూర్చోబెట్టింది. అశోక్ గజపతిరాజు న్యాయ పోరాటంతో తిరిగి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తన స్థానాన్ని దక్కించుకోవడంతో, అప్పటినుండి మాన్సాస్ ట్రస్ట్ లో అవినీతి, అక్రమాలపై దర్యాప్తు మొదలు పెట్టింది. మాన్సాస్ భూములపై విజిలెన్స్ విచారణకు శ్రీకారం చుట్టింది. ఇక మాన్సస్ ట్రస్ట్ లో ఇప్పటివరకు ఆడిటింగ్ జరగలేదని, అక్రమాలు చోటుచేసుకున్నాయని అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేసింది. మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులకు జీతాల రగడ నేపథ్యంలో అశోక్ గజపతిరాజు ఈవో పై ఉద్యోగులను రెచ్చగొట్టారని ఆయనపై కేసు కూడా నమోదు అయ్యేలా చేసింది. అడుగడుగున న్యాయపోరాటం చేస్తూ అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా కొనసాగే ప్రయత్నం చేస్తున్నారు.

 సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయని ధూళిపాళ్ళ ను టార్గెట్ చేసిన జగన్ సర్కార్

సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయని ధూళిపాళ్ళ ను టార్గెట్ చేసిన జగన్ సర్కార్

ఇదిలా ఉంటే ఇంతకుముందే సంగం డైరీ వ్యవహారంలో ధూళిపాళ్ల నరేంద్ర పై అక్రమాలు జరిగాయంటూ కేసులు పెట్టి జైలుకు పంపించిన ఇబ్బందులకు గురి చేసిన ఏపీ సర్కార్ ఆయనను ఇబ్బందులకు గురి చేసింది . సంగం డైరీ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపధ్యంలో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే . అప్పట్లో ఆయన కుటుంబం ధూళిపాళ్ళ నరేంద్రను కావాలని తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ కూడా ధూళిపాళ్ళ అరెస్ట్ పై ధ్వజమెత్తింది. ప్రశ్నించే గొంతులను నొక్కేసే క్రమంలో వైసీపీ సర్కార్ ఇలా చేస్తుందని పెద్ద ఎత్తున టీడీపీ నేతలు మండిపడ్డారు .

ఇప్పుడు మరో షాక్ .. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ వివరాలివ్వాలని డెడ్ లైన్

ఇప్పుడు మరో షాక్ .. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ వివరాలివ్వాలని డెడ్ లైన్

ఇప్పుడు కొత్తగా ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ పై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ధూళిపాళ్ల నరేంద్ర కు దేవాదాయ శాఖ నోటీసులు జారీ చేసింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టు స్వభావం ఏమిటో చెప్పాలంటూ ఆ నోటీసులో పేర్కొంది. ట్రస్టు వార్షిక ఆదాయం వివరాలు సమర్పించాలని దేవాదాయ శాఖ నోటీసులలో స్పష్టం చేశారు. ఇక దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ కు సంబంధించి ట్రస్టు ఆస్తులు, ట్రస్ట్ డీడ్, మేనేజింగ్ ట్రస్టీ, ఇతర ట్రస్టుల వివరాలకు సంబంధించిన కాపీలు అందించాలని దేవాదాయ శాఖ పేర్కొంది.

ధూళిపాళ్ళ ట్రస్ట్ క్రింద పని చేసే ఆస్పత్రి గోడకు నోటీసులు .. ఏం జరుగుతుందో ?

ధూళిపాళ్ళ ట్రస్ట్ క్రింద పని చేసే ఆస్పత్రి గోడకు నోటీసులు .. ఏం జరుగుతుందో ?

గత మూడు సంవత్సరాల వార్షిక ఆదాయం ఖర్చులకు సంబంధించిన వివరాలను, ఎఫ్డీఆర్ లు , ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు ఇవ్వాలని పేర్కొంది. ఇక ఈ వివరాలను ఇవ్వడానికి పది రోజుల డెడ్లైన్ విధించింది దేవాదాయశాఖ ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసుపత్రి గోడకు నోటీస్ అంటించి తాము అడిగిన వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో భ్రమరాంబ పేరుతో దేవాదాయ శాఖ నోటీస్ జారీ చేసింది. దీంతో ఇప్పుడు దూళిపాళ్ల ట్రస్ట్ పై వైసీపీ సర్కార్ ఫోకస్ చేసినట్లుగా టిడిపి వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ నుండి ప్రభుత్వాన్ని బలంగా ప్రశ్నించే నాయకులను ఏదో ఒక రకంగా ఇరికించే ప్రయత్నం జరుగుతుందని టీడీపీలో చర్చ జరుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+