క్లోజ్ సర్కిల్ ను టార్గెట్ చేస్తున్న నిమ్మగడ్డపై జగన్ సర్కార్ సీరియస్..ప్లాన్ 'బీ' తో రివర్స్ ఎటాక్ !!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై వైసిపి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న ప్రభుత్వ పెద్దలు నిమ్మగడ్డ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న గవర్నర్ కూడా శాసించే స్థాయిలో నిమ్మగడ్డ తీరు ఉందని తీవ్ర అసహనంతో ఉన్న ఏపీ ప్రభుత్వ పెద్దలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి నిమ్మగడ్డ పై ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

నిమ్మగడ్డ వ్యవహారశైలిపై రివర్స్ ఎటాక్ కు సిద్ధం అవుతున్న జగన్ సర్కార్
మరోపక్క జగన్ కు క్లోజ్ గా ఉన్న సర్కిల్ ను టార్గెట్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత రెండు రోజులుగా లేఖాస్త్రాలు సంధించడం, ఎన్నికలకు సహకరించడం లేదని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడం జగన్ సర్కార్ కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ క్రమంలో నిమ్మగడ్డ పై రివర్స్ ఎటాక్ చేయడానికి ప్లాన్ బి సిద్ధం చేసుకుంటుంది వైసీపీ సర్కార్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా కీలక భూమిక పోషిస్తున్న జగన్ కు క్లోజ్ సర్కిల్ గా ఉన్న ప్రభుత్వాధికారులను , పార్టీ ముఖ్య నాయకులను నిమ్మగడ్డ టార్గెట్ చేస్తున్నారు.

మూడు మార్గాల ద్వారా రివర్స్ ఎటాక్ కు వ్యూహం
నిమ్మగడ్డ వ్యవహారశైలిపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో పాటుగా, కోర్టును ఆశ్రయించాలని కూడా భావిస్తున్నట్లుగా సమాచారం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిధిని నిర్ధారించాలని, తనకు సంబంధం లేని ప్రభుత్వ నిర్ణయాలలో కూడా జోక్యం చేసుకుంటున్నారని కోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రివిలేజ్ కమిటీ దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ ఉన్నతాధికారులను నిమ్మగడ్డ టార్గెట్ చెయ్యటంపై గుర్రుగా జగన్ సర్కార్
చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్, పంచాయతీరాజ్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది, సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులను టార్గెట్ చేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా, ప్రభుత్వానికి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఇది ప్రభుత్వ పెద్దలకు ఏమాత్రం నచ్చలేదు. దీనిపై జగన్ సర్కార్ గుర్రుగా ఉంది. దీంతో తమ పై వరుస ఫిర్యాదులతో దాడి చేస్తున్న నిమ్మగడ్డ వ్యవహారశైలిపై ఫిర్యాదులు చేయడానికి జగన్ సర్కార్ కూడా రెడీ అవుతున్నట్లు గా సమాచారం.

టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో పై ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఫిర్యాదు
అంతేకాదు పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ మ్యానిఫెస్టో ప్రకటించటంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని వైసీపీ నేతలు ఆగరహంతో ఉన్నారు. పక్షపాత ధోరణితో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని భావిస్తున్న వైసీపీ ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ముందు ముందు మరే రూపం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications