నారా లోకేష్ ఓటమికి జగన్ భారీ స్కెచ్
సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ అధినేత , సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తూ, అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని ధీమాను మొదటి నుంచి జగన్ వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.దీనికి అనుగుణంగానే ప్రత్యర్థుల బలాలు, బలహీనతలను అంచనా వేసి దానికి అనుగుణంగా రాజకీయ వ్యూహాలు రూపొందిస్తున్నారు ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో ఎవరూ ఊహించని విధంగా ఆయన తన ప్రచారానికి మూడు రోజులు బ్రేక్ ఇచ్చారు.
పోలింగ్ నాడు అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ పార్టీ నేతలతో చర్చించనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో పార్టీ గెలుపు గురించి నాయకులతో చర్చించారాయన. ముఖ్యంగా మంగళగిరిలో వైసీపీ గెలుపుపై ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారా లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణరెడ్డి చేతిలో ఓటమి పాలైయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా లోకేష్ తిరిగి మంగళగిరి నుంచి పోటీ చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.

అక్కడ లోకేష్ ఓటమి కోసం వైసీపీ భారీగానే వ్యూహాలు రచిస్తోంది.ఇక్కడ లోకేష్‌పై చేనేత సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్యను అభ్యర్థిగా రంగంలోకి దింపారు. ఈ నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం తమకు కలిసి వస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. గతంలో ఇక్కడ నుంచి మురుగుడు లావణ్య తల్లి కాండ్రు కమల, ఆమె మామయ్య మురుగుడు హనమంతురావు ఎమ్మెల్యేలుగా పని చేయడం ఆమెకు కలిసి వచ్చే అంశమని చెప్పాలి.
దీనికి తోడు నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు సైతం అధిక స్థాయిలో అమలు చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. పేద, బలహీన వర్గాలు తమతోనే ఉన్నాయని..మంగళగిరిలో కచ్చింతంగా వైసీపీనే విజయం సాధిస్తుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంగళగిరిలో విజయమే లక్ష్యంగా స్థానిక నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. మొత్తానికి నారా లోకేష్‌ను ఓడించడానికి వైసీపీ అధినేత గట్టిగానే పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications