జగన్ గురించి వేస్ట్, వారిని వదిలేస్తున్నా: బాబు, పవన్ కళ్యాణ్ గురించి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తమకు ఏమాత్రం పోటీ కాదని, 2019లో రామ్మోహన్ నాయుడు, దేవినేని అవినాష్ వంటి యంగ్ జనరేషన్ నేతల్ని చూస్తారని చంద్రబాబు అన్నారు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తమకు ఏమాత్రం పోటీ కాదని, 2019లో రామ్మోహన్ నాయుడు, దేవినేని అవినాష్, నారా లోకేష్ వంటి యంగ్ జనరేషన్ నేతల్ని చూస్తారని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఆయన ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ఇప్పుడు పొత్తుల గురించి ఆలోచించాల్సిన సమయం కాదని, రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించాలని చంద్రబాబు అన్నారు.

జగన్‌పై అవినీతి విమర్శలు.. మరి, మాట్లాడుకోవడం వేస్ట్
తమ పాలనలో అవినీతిని కంట్రోల్ చేశామని చంద్రబాబు అన్నారు. ఇక్కడ అవినీతి అనే ప్రశ్నకు తావే లేదన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. కానీ ఇప్పుడు దానికి ఆస్కారం లేదన్నారు. జగన్ తమకు ఏమాత్రం పోటీదారు కాదని తేల్చారు. జగన్‌కు నిలకడ ఉండదని వ్యాఖ్యానించారు. ఇంటెగ్రిటీ, వ్యక్తిత్వం లేని వారి గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అన్నారు.

పవన్ కళ్యాణ్ గురించి...
వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్‌ను తాను గౌరవిస్తానని చంద్రబాబు చెప్పారు. అయితే 2019లో పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం మాత్రం సరి కాదని చెప్పారు.

అప్పుడే రాజకీయాలను ఎంపిక చేసుకోవాలి
రాజకీయాలను ఎవరు కూడా ప్రొఫెషన్‌గా ఎంచుకోవద్దని చంద్రబాబు అన్నారు. ఎవరైనా జీవితంలో సెటిల్ అయ్యాక రాజకీయాల గురించి ఆలోచించాలన్నారు. అప్పుడే మీరు సేవ చేయగలుగుతారన్నారు. తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పారు. జీవితాన్ని గడిపేందుకు రాజకీయాలపై ఆధారపడవద్దన్నారు.

ఆ బిజెపి నేతల విజ్ఞతకు వదిలేస్తున్నా
కొందరు బిజెపి నేతలు తమ పార్టీని, తనను విమర్శించడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చంద్రబాబు అన్నారు. పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివ రావు వంటి నేతలు టిడిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. తాము పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నామని, తమ పార్టీ నేతలకు కూడా అదే ఆదేశాలు జారీ చేశానని చెప్పారు. తమ పార్టీలో లక్ష్మణ రేఖ దాటితే చర్యలు ఉంటాయన్నారు.

ప్రధాని మోడీకి అనుకూలంగా ఎందుకంటే..
ప్రపంచవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ భారత దేశాన్ని ఉన్నత స్థితిలో నిలబెడుతున్నారని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోడీ ప్రపంచంలో దేశానికి పేరు తెస్తూనే, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. కాబట్టి అలాంటి వారికి మద్దతుగా నిలబడాలని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications