'జగన్ వయసు తక్కువ మాటలెక్కువ, పాపం వైఎస్సేదే'
నల్గొండ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వయసు తక్కువ, మాటలు ఎక్కువ అని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు బుధవారం మండిపడ్డారు. విహెచ్ సోనియా కృతజ్ఞత యాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడారు.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పంచాయతీ మీ నాన్న వైయస్ రాజశేఖర రెడ్డి పెట్టిందేనని, దానికి అసలు సూత్రధారి ఆయనేనని ధ్వజమెత్తారు. మిగులు జలాలపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నామంటూ సొంత నిర్ణయం తీసుకొని, ట్రిబ్యునల్‌కు లేఖ ఇచ్చి పోతిరెడ్డిపాడుకు అక్రమంగా నీళ్లు తీసుకుపోయారని ఆరోపించారు.

ట్రిబ్యునల్ తీర్పుతో కృష్ణా పరివాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చి, తెలంగాణ నోట్లో మట్టికొట్టిన పాపం వైయస్‌దే అన్నారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని జగన్ భూములు, గనులు దోచుకొని లక్షల కోట్లు కూడబెట్టారని, ఇప్పుడు నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నారన్నారు. జగన్ వయసు తక్కువ, మాటలు ఎక్కువ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బందుతో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. పది జిల్లాల తెలంగాణే కాంగ్రెసు ఇస్తుందని, రాయల టిని ఒప్పుకోమన్నారు. నల్గొండ జిల్లాలో విహెచ్ సోనియా కృతజ్ఞత యాత్ర ముగిసింది.












Click it and Unblock the Notifications