ఢిల్లీలో ధర్నా సమయంలో జగన్ కీలక నిర్ణయం..!

ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ స్పీడ్ పెంచారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులే టార్గెట్ గా దాడులు, హత్యలు జరుగుతుండడం, శాంతి భద్రతలు అదుపు తప్పడం వంటి వాటిని జగన్ సీరియస్‌గా తీసుకున్నారు. వైసీపీనే టార్గెట్ చేసుకుని అధికారి టీడీపీ కూటమి చేస్తున్న దాడులను నిరోధించేందుకు, ఈ విషయంలో కేంద్ర అధికార పార్టీ బీజేపీ కలుగు చేసుకునే విధంగా వ్యూహాత్మకంగా జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు కూడా ఏపీలో అదుపుతప్పాయని, వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటనకు సంబంధించి, అలాగే పుంగనూరులో ఎంపీ మిధున్ రెడ్డిపై జరిగిన రాళ్లదాడి వ్యవహారం పైన గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేశారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయని ఇప్పటికే జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. వీటిని నిరసిస్తూనే ఢిల్లీ వేదికగా పోరాటం చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.

Jagan key decision during the dharna in Delhi

దేశ రాజధానిలో జరిగే ఈ పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలంటూ విపక్ష పార్టీలకు జగన్ ఆహ్వానిస్తూ .. అందరిని ఏకం చేసి తమ పోరాట కార్యక్రమానికి మద్దతు ఉండేలా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే నేడు(జులై 24) ఢిల్లీలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వైసీపీ కీలక నాయకులంతా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

ఢిల్లీలో ధర్నా సమయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కూటమి హత్యాకాండల గురించి ధర్నా చేసే ప్రాంగణంలో ఫోటో / వీడియో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచీ జరుగుతున్న హింసకు సంబంధించిన ఫోటో గ్యాలరీ, వీడియోలను ప్రదర్శించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ ఎగ్జిబిషన్ కు మీడియా అంతటినీ ఆహ్వానిస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను హైలెట్ చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని వైసీపీ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+