ఎలా ఇస్తారు: రాజధానిపై జగన్ హామీ సాధ్యమా?

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం రాజధాని ప్రాంతంలో పర్యటించి.. వారికి ఓ హామీ ఇచ్చారు. ఈ హామీ పైన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. జగన్ ఇస్తున్న హామీలో ఏమాత్రం వాస్తవం లేదని విమర్శిస్తున్నారు.

జగన్ చెప్పినట్లుగా ల్యాండ్ పూలింగ్‌కు ఎలాంటి అడ్డంకులు లేవని అధికార పార్టీ నేతలు అంటున్నారు. రాజధాని కోసం 34వేల ఎకరాలు సేకరించినట్లు పరకాల ప్రభాకర్ బుధవారం చెప్పారు. అదే సమయంలో పవన్ ఇచ్చిన హామీ పైన అధికార పార్టీ నేతలు, ఇతరులు విమర్శలు గుప్పిస్తున్నారు.

'Jagan land promise irrelevant'

చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్లలో పడిపోతుందని, తాము అధికారంలోకి వచ్చాక రైతుల భూములు తిరిగి ఇస్తామని జగన్ చెప్పారు. అయితే, జూన్ నెలలో రాజధాని ప్రారంభమవుతుందని, జగన్ చెబుతున్న నాటికి రాజధాని పూర్తి కాకపోయినా.. ప్రస్తుత భూమి ఎలా ఉందో, అలా ఉండదని, అలాంటప్పుడు వారి భూములు వారికి తిరిగి ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+