ఎన్టీఆర్ , వై ఎస్సార్ ల తర్వాత రాజకీయాల్లో లెజెండ్ .. నిజమైన వారసుడు వైఎస్ జగన్ అన్న యార్లగడ్డ
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేత ప్రశంసలు అందుకున్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి మీద ఆయన సంకలనం చేసిన పెద్దల సభలో తెలుగు పెద్ద అన్న పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వై ఎస్సార్ లోని గొప్ప లక్షణాలు . ఎన్టీఆర్ లోని గొప్ప గుణాలు జగన్ కు ఉన్నాయన్న యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి లకు నిజమైన రాజకీయ వారసుడిగా ఆయన అభివర్ణించారు. అటు రాజశేఖర్ రెడ్డిలోని గొప్ప లక్షణాలు, ఇటు ఎన్టీఆర్ లోని గొప్ప గుణాలు జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ మరియు రాజశేఖర్ రెడ్డి తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు చేశారని, తెలుగు ప్రజల ఖ్యాతిని ఇనుమడింప చేశారని వారు తెలుగు ప్రజల గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి లో వైయస్సార్ యొక్క అంకితభావం, నిబద్ధత, ఆయన తరహాలో ఆశయ సాధనకై పనిచేసే తత్వం ఉన్నాయని పేర్కొన్న ర్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇక ఎన్టీఆర్ లోని దయా హృదయం, మంచి మనసు కూడా జగన్ కు ఉన్నాయని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ , వై ఎస్సార్ తర్వాత జనం చెప్పుకునే నేత జగన్ అన్న యార్లగడ్డ
అంతేకాదు పెద్దల సభలో తెలుగు పెద్ద అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన యార్లగడ్డ ఎన్టీఆర్, మరియు వైయస్సార్ తరువాత జనం గుండెల్లో నిలిచిపోయే నేత జగన్ అంటూ పేర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలో అని చంద్రబాబు పేరును ఆయన ప్రస్తావించలేదని తెలుస్తుంది . ఇక ఆసక్తికరమైన ఒక విషయాన్ని చెబుతూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మే 20వ తేదీన తాను జగన్ ను కలిశానని నాటా సభలకు అమెరికా వెళుతున్నట్లుగా చెప్పానని పేర్కొన్నారు. అయితే జగన్ మాత్రం అలా ఎలా వెళతారన్నా .. నేను మే 30 వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పారని ఇది జగన్ విశ్వాసానికి నిదర్శనమని యార్లగడ్డ తెలిపారు.

ఎన్టీఆర్ , వైఎస్సార్ ల సమిష్టి నాయకత్వ లక్షణాలు ..యార్లగడ్డ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ
అంతేకాదు వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య పై తన పుస్తకం ఆవిష్కరించారని ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారని వైయస్ రాజశేఖర్ రెడ్డి తో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక నేడు జగన్ సైతం తన పుస్తకాన్ని ఆవిష్కరించటం చాలా సంతోష దాయకమని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ , వైఎస్సార్ ల సమిష్టి నాయకత్వ లక్షణాలు జగన్ లో ఉన్నాయని చెప్పటం మాత్రం ఆశ్చర్యం కలిగించే అంశమే . మొత్తానికి యార్లగడ్డ ఎన్టీఆర్ , వైఎస్సార్ ల తర్వాత నిజమైన రాజకీయ వారసుడిగా జగన్ ను పేర్కొనటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications