అమరావతిపై జగన్ 'పద్మవ్యూహం'.. ఎన్నికల అజెండా!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు రెండో విడ‌త పాద‌యాత్ర చేస్తున్నారు. ''అసెంబ్లీ to అర‌స‌వెల్లి'' పేరుతో సాగుతున్న యాత్ర ప్ర‌స్తుతం గోదావ‌రి జిల్లాల్లోకి ప్ర‌వేశించింది. అధికారంలో ఉన్న వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మూడు రాజధానులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.

టీడీపీ ప్రధాన ప్రచారాస్త్రం.. అమరావతి

టీడీపీ ప్రధాన ప్రచారాస్త్రం.. అమరావతి

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అమరావతే ప్రధాన స్లోగన్ అవబోతోంది. ఇదే ఆ పార్టీకి కీలకమైన అజెండాగా మారబోతోంది. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల అంశాన్ని రానున్న ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రధాన అజెండాగా మార్చాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా మూడు రాజధానుల విషయం ప్రజల్లోకి బలంగా చొప్పించేలా ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

మూడు రాజధానులవల్ల లాభాలు?

మూడు రాజధానులవల్ల లాభాలు?

తన వ్యూహంలో భాగంగా ఆయన మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగసభలను జరపాలని నిర్ణయించారు. అమరావతినే చంద్రబాబు రాజధానిగా నిర్ణయించడంలో తెలుగుదేశం పార్టీ అవలంబించిన విధానాలు? ఆ పార్టీకి ఉన్న సౌలభ్యం ఏమిటి? ఒకే రాజధాని ఉండటంవల్ల నష్టాలేంటి? తాను ఎందుకు మూడు రాధానులు ప్రకటించింది? వీటివల్ల లాభాలు? రాష్ట్రాభివృద్ధి తదితర విషయాలను ప్రజలకు విపులంగా చెప్పాలనే నిర్ణయానికి జగన్ వచ్చారు. అందుకు ఈ సభలను ఉపయోగించుకోబోతున్నారు. రాజధాని అమరావతిలోనే తాళ్లాయపాలెం సమీపంలో మూడు రాజధానులకు మద్దతుగా నిరాహారదీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ప్రజలు సానుకూలంగానే ఉన్నారంటున్న జగన్?

ప్రజలు సానుకూలంగానే ఉన్నారంటున్న జగన్?

అంతేకాకుండా రాజధాని ఏర్పాటుకు శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది? యూపీఏ ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది? తదితర వివరాలను కూడా ప్రజలకు చెప్పాలని జగన్ భావిస్తున్నారు. తాను చెప్పే అంశాలకు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల నుంచి సానుకూలత వస్తుందనే ఆశాభావాన్ని సన్నిహితుల దగ్గర సీఎం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం, వైసీపీలకు రేపటి ఎన్నికల్లో 'అమరావతి' అనేది ప్రధాన ప్రచారాస్త్రంగా మారబోతోందని స్పష్టమవుతోంది. ఆ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అమరావతికి అనుకూలమా? మూడు రాజధానులకు అనుకూలమా? అనే విషయంలో పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. అప్పటివరకు వేచిచూడటమే.!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+