వదల బొమ్మాళీ ... అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సుప్రీంకు జగన్ సర్కార్- హైకోర్టు స్టేపై
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో రాజధాని పేరిట టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ ఆరోపణలు చేసేది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ ఇన్ సైడర్ ట్రేడింగ్ పై దర్యాప్తు చేయించింది. అదే సమయంలో సిట్ ఏర్పాటు, ఇన్ సైడర్ ట్రేడింగ్ దర్యాప్తుపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే లభించింది.
అమరావతిలో టీడీపీ నేతలతో పాటు మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మా్లపాటి శ్రీనివాస్ కూడా అక్రమంగా భూములు కొనగోలు చేయడం ద్వారా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ సర్కారు ఆరోపిస్తోంది. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. దీంతో హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే అదనపు సమాచారం ఇచ్చేందుకు సమయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టును సమయం కోరారు. దీంతో విచారణ రెండు వారాల పాటు వాయిదా పడింది.

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ సర్కార్ తమపై అక్రమ కేసులు పెట్టిందంటూ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇన్ సైడర్ ట్రేడింగ్ పదాన్ని అమరావతి భూముల కొనుగోళ్లకు ఎలా వర్తింపచేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో వాడే పదమని తెలిపింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో అమరావతి భూముల కొనుగోళ్లపై దర్యాప్తు చెల్లదని ప్రకటించింది. సిట్ ఏర్పాటుతో పాటు అమరావతిలో దర్యాప్తుపైనా స్టే విధించింది. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications