జగన్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్-నోరు జారిన వైసీపీ ఎమ్మెల్యే-పరువునష్టం దావాలో వాడుకున్న ఏబీ
ఏపీలో పెగాసస్ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. చంద్రబాబు టీడీపీ ప్రభుత్వ హయంలో పెగాసస్ స్పైవేర్ కొన్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారంటూ వైసీపీ మొదలుపెట్టిన విమర్శలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో జగన్ సర్కార్ కూడా ఫోన్లు ట్యాప్ చేస్తోందంటూ వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు సర్కార్ మెడకు చుట్టుకునేలా ఉన్నాయి.

ఏపీలో పెగాసస్ రచ్చ
ఏపీలో పెగాసస్ స్పైవేర్ కొనుగోలు, వాడకం వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మమతా బెనర్జీ చంద్రబాబుపై చేసిన ఆరోపణల ఆధారంగా అసెంబ్లీలో చర్చ పెట్టిన వైసీపీ సర్కార్.. దీనిపై సభా సంఘాన్ని విచారణ కోసం నియమించింది. అంతటితో ఆగకుండా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు టీడీపీ టార్గెట్ గా విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసి వైసీపీ ప్రభుత్వ హయాంలో సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర కీలకంగా మారింది. దీంతో ఆయన్ను కూడా వైసీపీ టార్గెట్ చేస్తోంది. అయితే ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు నోరు జారారు.

జగన్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్
ఏపీలో జగన్ సర్కార్ కూడా ఫోన్లు ట్యాప్ చేస్తోందంటూ వైసీపీకి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ నోరు జారారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పరికరాల్ని వాడుతోందా అంటే వాడుతోందనే చెప్తామని అమర్నాథ్ తెలిపారు. దేశంలోని ప్రతీ రాష్ట్రంలోనూ ఈ పరికరాల్ని, సాఫ్ట్ వేర్లను దేశ భద్రత దృష్ట్యా వినియోగిస్తారని, తమ ప్రభుత్వం కూడా వీటిని రాష్ట్ర ప్రయోజనాల కోసమే వినియోగిస్తుంది తప్ప.. చంద్రబాబు ఏం చేస్తున్నారు ? ఆయన భార్యతో ఏం మాట్లాడుతున్నారు ? ఆయన కుమారుడు, కోడలు ఏం మాట్లాడుతున్నారు ? అనేది తెలుసుకోవడానికి కాదన్నారు. పెగాసస్ స్పైవేర్ కు సంబంధించి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని కూడా చెప్పారు.

తర్వాత మాట మార్చిన అమర్నాథ్
ఆ తర్వాత గుడివాడ అమర్నాథ్ మరోసారి మీడియా ముందుకొచ్చి తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల్ని చేయదు, ప్రోత్సహించదన్నారు. ప్రతీ వ్యవస్ధకు ఓ సాఫ్ట్ వేర్ ఉంటుంది. సాఫ్ట్ వేర్, స్పైవేర్ రెండూ వేర్వేరు అంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్ కోసం పెగాసస్ వాడుతోందంటూ ఆయన చేసినట్లు చెప్తున్న వ్యాఖ్యలు జనంలోకి వెళ్లిపోయాయి. దీంతో ఇప్పుడు వాటిని పెగాసస్ వివాదంలో వైసీపీ టార్గెట్ చేస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు వాడుకుంటున్నారు.

ఏబీ పరువునష్టం దావాలో ప్రస్తావన
నిఘా స్పైవేర్ వాడుతున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకుని ఏబీ వెంకటేశ్వరరావు పరువునష్టం దావా వేయబోతున్నారు. ఇప్పటికే అమర్నాథ్ తనపై చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తానని ప్రకటించిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఇప్పుడు అమర్నాథ్ వ్యాఖ్యల్ని అందులో జత చేస్తున్నారు.
ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తనపై చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వొచ్చని ఏబీ సూచించారు.
ఎమ్మెల్యే గుడివాడ వ్యాఖ్యలు ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలనే విషయం స్కూలుకు వెళ్లి చదువుకున్న ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుందని ఏబీ తాజాగా వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం కూడా పెగాసస్ స్పైవేర్ ను నిబంధనలకు లోబడి వాడుతుందన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలను పరువునష్టం దావాలో ఏబీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications