మిథున్ రెడ్డి అరెస్ట్‌పై జగన్ తొలి రియాక్షన్..టచ్ చేయలేరంటూ

వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అక్రమ కేసు అని, ప్రజల తరపున పోరాడే వారి గొంతుకను అణచివేయడానికే ఈ చర్య అని ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

జగన్ తన ట్వీట్‌లో, వరుసగా మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని బలవంతపు వాంగ్మూలాల ద్వారా తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆయన విమర్శించారు. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టుగా చూపించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు అంతా ప్రలోభాలు, బెదిరింపులు, థర్డ్ డిగ్రీ ద్వారా తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని నడిపిస్తున్నదే అని జగన్ పేర్కొన్నారు.

Jagan responds to MP Mithun Reddy arrest

చంద్రబాబు తన గత పాలనలో చేసిన మద్యం కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నారని గుర్తు చేస్తూ, తన హయాంలోని అవినీతి పద్ధతులను ఇప్పుడు పునఃప్రారంభించారని జగన్ దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం వేలాది బెల్టుషాపులు, పర్మిట్ రూమ్‌లను మూసివేయించి, మద్యం దుకాణాలను గణనీయంగా తగ్గించిందని, కానీ కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో మద్యం మాఫియా రంగంలోకి దిగిందని, వైన్ షాపులకు లైసెన్స్ మంజూరులో మాఫియాదే పైచేయి అయిందని జగన్ విమర్శించారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, తనపై ఉన్న అవినీతి కేసుల దర్యాప్తును చంద్రబాబు నిలిపివేశారని ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీని ఎవరూ ఏమీ చేయలేరు. ప్రజల గుండెల్లో వైఎస్సార్‌సీపీ బలంగా పాతుకుపోయిందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా గొంతుకగా ప్రజలతో కలిసి ఉంటామని, ఈ అన్యాయాన్ని ఎదుర్కొంటూ తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+