వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ నియంత పాలన, చంద్రబాబును జైలుకు పంపే ఆలోచనతోనే కుట్ర : నోటీసులపై టీడీపీ నేతల ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీ సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ చేయడంపై టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. రాజధాని అమరావతి భూములలో అక్రమాలు జరిగినట్టు, టిడిపి నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఊహించని విధంగా చంద్రబాబు నాయుడికి రాజధాని భూముల విషయంలో నోటీసులు జారీ చేయడంతో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని టిడిపి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

చంద్రబాబుకు సిఐడీ నోటీసుల వెనుక ఉంది ఎమ్మెల్యే ఆర్కే .. ఆ ఫిర్యాదు మేరకే నోటీసులుచంద్రబాబుకు సిఐడీ నోటీసుల వెనుక ఉంది ఎమ్మెల్యే ఆర్కే .. ఆ ఫిర్యాదు మేరకే నోటీసులు

జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ పోకడలతో రాష్ట్రం నాశనం అవుతుంది : నిమ్మల రామా నాయుడు

జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ పోకడలతో రాష్ట్రం నాశనం అవుతుంది : నిమ్మల రామా నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ పోకడలతో రాష్ట్రం నాశనం అవుతుందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న చర్యలన్నీ వైసిపి మైండ్ గేమ్ అని చంద్రబాబు అభివర్ణించారు. ఇన్సైడర్ ట్రేడింగ్, క్విడ్ ప్రో కో వంటి విషయాలపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. గతంలో ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు అనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.

మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో కొత్త నాటకానికి తెర తీశారు : ఆలపాటి రాజా

మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో కొత్త నాటకానికి తెర తీశారు : ఆలపాటి రాజా

మాజీ మంత్రి ఆలపాటి రాజా సిఐడి అధికారులు చంద్రబాబుకు నోటీసు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో కొత్త నాటకానికి తెర తీశారని ఆయన మండిపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ను జరగలేదని గతంలో హైకోర్టు పేర్కొంది అని చెప్పిన మాజీ మంత్రి ఆలపాటి రాజా తన అవినీతి మరకలను అందరికీ అంటించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో తన తండ్రి అధికారంతో దోపిడీ చేసిన జగన్ రెడ్డి, తాజాగా సీఎం గాని దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు.

 తాను జైలుకు వెళ్ళాడు కాబట్టి జగన్ కు అందరూ జైలుకు వెళ్లాలనే ఆలోచన : యరపతినేని

తాను జైలుకు వెళ్ళాడు కాబట్టి జగన్ కు అందరూ జైలుకు వెళ్లాలనే ఆలోచన : యరపతినేని

అందరూ తనలాగే ఉంటారని జగన్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది కావాలని జగన్ సర్కార్ ఆడుతున్న పైశాచిక క్రీడ అని నిప్పులు చెరిగారు. బాబు పై బురద చల్లాలని, కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని టిడిపి నేత మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ మండిపడ్డారు. తాను జైలుకు వెళ్ళాడు కాబట్టి అందరూ జైలుకు వెళ్లాలనే ఆలోచన సీఎం జగన్ చేస్తున్నాడని విమర్శించారు .వచ్చిన ఏ మాత్రం కరెక్ట్ కాదని యరపతినేని శ్రీనివాస్ వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు : బుద్దా వెంకన్న

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు : బుద్దా వెంకన్న

జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు పరాకాష్టకు చేరింది అని కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు ఏదో ఒక విధంగా కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టాలని సీఎం జగన్ చూస్తున్నారని విమర్శించారు రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదనే విషయం తెలుసుకోవాలని పేర్కొన్న బుద్ధ వెంకన్న చంద్రబాబును మానసికంగా హింసించడం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. జగన్ రెడ్డి ని గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.

English summary
TDP leaders are upset over AP CID officials issuing notices to Chandrababu Naidu. It is known that since the YCP government came to power, Telugu Desam has been targeting by ycp govt, alleging irregularities in the lands of the capital Amaravati . TDP leaders have been sharply critical of the YCP government for taking partisan action by issuing notices to Chandrababu Naidu on capital lands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X