'పులులు, సింహాలు అడవుల్లో ఉండాలి.. జగన్ జైల్లో ఉండాలి'
జగన్ ఆరాటమంతా సీఎం పదవి కోసమేనని వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా ఉండరని దేవినేని వ్యాఖ్యానించారు.
విజయవాడ: వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. 'పులులు, సింహాలు అడవుల్లో ఉండాలి.జగన్ లాంటి వాళ్లు జైల్లో ఉండాలి' అని విమర్శించారు.

జగన్ ఆరాటమంతా సీఎం పదవి కోసమేనని వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా ఉండరని దేవినేని వ్యాఖ్యానించారు. జగన్ ఇప్పటికైనా ఫ్యాక్షన్ రాజకీయాలను పక్కనబెట్టాలని దేవినేని సూచించారు. చంద్రబాబుపై జగన్ చేస్తున్న ఆరోపణలను ఉటంకిస్తూ.. బహిరంగ చర్చకు సిద్దమా అని దేవినేని జగన్ ను సవాల్ చేశారు.
శనివారం నాడు మీడియాతో మాట్లాడిన సందర్బంగా దేవినేని ఈ విమర్శలు చేశారు. ఏపీలో ఆటలను సాగనివ్వమని, అమరావతి నిర్మాణాన్ని వ్యతిరేకించే జగన్, ఏ ముఖం పెట్టుకుని వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని దేవినేని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications