కిమ్స్ కెళ్లి దాసరిని పరామర్శించిన జగన్: త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
జగన్ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఆయన వెంట భూమన కరుణాకర్ రెడ్డి, బాలసౌరి తదితరులు ఆయన వెంట వెళ్లారు. దాసరి ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడిన జగన్.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న దర్శకరత్న దాసరి నారాయణరావును వైసీపీ అధినేత జగన్ కలిశారు. బుధవారం ఉదయం ఆసుపత్రిలో దాసరిని కలిసిన జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జగన్ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఆయన వెంట భూమన కరుణాకర్ రెడ్డి, బాలసౌరి తదితరులు ఆయన వెంట వెళ్లారు. దాసరి ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడిన జగన్.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కాగా, ఊపిరితిత్తులు, కిడ్నీ, మూత్రపిండాల సమస్యలతో మాజీ కేంద్రమంత్రి దాసరి
నారాయణరావు గతకొంత కాలంగా బాధపడుతున్నారు. దాసరి ఆసుపత్రిలో చేరినప్పటినుంచి తరుచూ ఆసుపత్రికెళ్లి సినీ నటుడు మోహన్ బాబు ఆయన బాగోగులను చూసుకుంటున్నారు .

Click it and Unblock the Notifications