Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ ఆర్మీ Vs పవన్ ఆర్మీ - మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఇదీ లెక్క..!!

ఏపీలో ఫలితాల పై ఉత్కంఠ కొనసాగుతోంది. గెలుపు పైన ఎవరి ధీమా వారిది. కానీ, ఓటరు తీర్పు ఇచ్చేసారు. పోలింగ్ సరళి పైన క్లారిటీ వచ్చేసింది. ఇద్దరూ గెలుస్తున్నామని చెబుతున్నా..గెలిచేది ఒక్కరే. ఎవరికి ఆ విజయం దక్కేది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలుపు ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. మెజార్టీ పైన లెక్కలు వేస్తున్నారు. అటు పులివెందులలో జగన్ మెజార్టీ పైన బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ ఇద్దరి మెజార్టీ పైన లెక్కలు బయటకు వస్తున్నాయి.

తుది కసరత్తు
ఇప్పుడు ఫలితాల పైన పార్టీలు ఇంకా తుది కసరత్తు చేస్తున్నాయి. పోలైన ఓట్ల ఆధారంగా తమకు దక్కే ఓట్ల పైన లెక్కలు వేస్తున్నాయి. గెలుపు..మెజార్టీ పైన విశ్లేషణలు మొదలు పెట్టాయి. ఇదే ఈ సమయంలో కొందరి గెలుపు పైన అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. దీంత, ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుందనేది ప్రతిష్ఠాత్మకంగా మారింది. 2019 ఎన్నికల్లో జగన్ 90,110 ఓట్ల మెజార్టీతో రాష్ట్రంలోనే అధిక మెజార్టీ తో గెలిచిన వ్యక్తిగా నిలిచారు. ఈ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, షర్మిల ఎఫెక్ట్ తో మెజార్టీ తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో పిఠాపురంలో పవన్ మెజార్టీ పైన బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి.

Jagan vs Pawan Kalyan Who Will Secure the Highest Majority in AP Assembly election 2024

ఎవరి ధీమా వారిది
పవన్ కల్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుస్తారని జనసైనికులు ధీమాగా చెబుతున్నారు. కానీ, ఇక్కడ ఆసక్తి కర అంశాలు తెర మీదకు వస్తున్నాయి. 2019లో పిఠాపురం నుంచి గెలిచిన దొరబాబు 83,459 ఓట్లు దక్కించుకున్నారు. కాగా.. 14,992 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వర్మకు 68,467 ఓట్లు పోలయ్యాయి. జనసేన నుంచి పోటీ చేసిన శేషకుమారికి 28011 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు వర్మ జనసేనకు మద్దతుగా నిలవగా.. శేషకుమారి వైసీపీలోచేరారు. ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీతకు 2009లో 46,623ఓట్లు రాగా అప్పుడు వర్మ పైన 1,036 ఓట్లతో విజయం సాధించారు. అదే ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముద్రగడకు కు 43, 341 ఓట్లు పోలయ్యాయి.

Jagan vs Pawan Kalyan Who Will Secure the Highest Majority in AP Assembly election 2024

జగన్ వర్సస్ పవన్
ఇప్పుడు ముద్రగడ పిఠాపురంలో పవన్ ను ఓడించకపోతే పేరు మాకుంటానని సవాల్ చేసారు. పవన్ పైన విజయం పైన జనసైనికులు పూర్తి ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధిస్తారని సోసల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే, పిఠాపురంలో 2019లో 80.99 పోలింగ్ నమోదు కాగా, 86.63 శాతం పోలింగ్ జరిగింది. అదే విధంగా పులివెందులలో 81.34 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు జగన్ - పవన్ మధ్య ఎవరి మెజార్టీ ఎక్కువ వస్తుందనేది చర్చగా మారింది. అయితే, పిఠాపురంలో ఏకపక్షంగా పోలింగ్ జరిగిందని జనసైనికులు చెబుతున్నారు. దీంతో..రాష్ట్రంలో గెలుపు పైన అంచనాలు వ్యక్తం అవుతున్న సమయంలో..జగన్ -వపన్ లో ఎవరి మెజార్టీ ఎక్కువ అనేది ఇద్దరికీ ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+