జగన్ కు అధికార యోగం : ఏపికి ప్రత్యేక హోదా : వైసిపి కార్యాలయంలో పంచాగ శ్రవణం..!
ఏపిలో ఎన్నికల హడావుడి మధ్య రాజకీయ పార్టీల కార్యాలయంలో పంచాగ శ్రవణాలు ఆసక్తి కరంగా మారాయి. వైసిపి కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. పంచాగ శ్రవణంలో వైసిపి అభిమానులకు సిద్దాంతులు శుభవార్త చెప్పారు . ఈ ఎన్నికల్లో జగన్ కు అధికార యోగం సిద్దిస్తుందని చెప్పుకొచ్చారు. ఏపికి ప్రత్యేక హోదా ఈ ఏడాది దక్కుతుందని పండితులు పంచాంగ పఠనం లో స్పష్టం చేసారు.
జగన్ కు అధికార యోగం..
తాడేపల్లి లోని వైసిపి ప్రధాన కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పార్టీ అధినేత జగన్ తో సహా పార్టీ నేతలు పాల్గొన్నారు. వేద పండితులు జగన్ కు ఆశీర్వాదం ఇచ్చారు. విష్ణుభట్ల లక్ష్మీనారాయణ పంచాగ శ్రవణం చేసారు. అందులో ప్రస్తు త ఎన్నికల వాతావరణం వైసిపికి అనుకూలంగా ఉందని చెప్పుకొచ్చారు. జగన్ కు అధికార యోగం సిద్దిస్తుందని స్పష్టం చేసారు. జగన్ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏపిలో వర్షాలు బాగా కరు స్తాయని వివరించారు. రైతులకు వాతావరణంతో పాటుగా మద్దతు ధరలు అనుకూలంగా ఉంటాయన్నారు. ఏపిలో ఎంతో కాలంగా మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరుచుకుంటాయన్నారు. వ్యాపార రంగాలో ఉన్న వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుందన్నారు.

ఆదాయం 11... వ్యయం 5
వైసిపి అధినేత జగన్ కు ఈ ఏడాది ఆదాయం 11 గా ఉండగా..వ్యయం 5 గా ఉందని పండితులు పంచాగ శ్రవణం లో పేర్కన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపిలో అన్ని రంగాల్లో అభివృద్ది సాధ్యం అవుతుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని వివరించారు. ఈ ఏడాది రాజకీయంగా అధికార - ప్రతిపక్షాల మధ్య పోరు తీవ్రంగా ఉంటుం దని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షానికి అధికార యోగం ఉంటుందన్నారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారంతో ఏపి కి ప్రత్యేక హోదా సాధ్య పడుతుందన్నారు. అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తారన్నారు. ఏపిలో పూర్తిగా శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని చెప్పుకొచ్చారు. జగన్ కు రాజపూజ్యం..అవమానం సమానంగా 2-2 గా ఉన్నా యని చెప్పారు. కళాకారులకు అనుకూలంగా ఉంటుందని పండితులు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications