వైసీపీ మేనిఫెస్టో: టీవీలకు అతుక్కుపోయిన జనం
YSRCP Manifesto: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. అటు పోలింగ్ గడువు సమీపిస్తోంది. ఈ నెల 25వ తేదీ నాటితో నామినేషన్లను దాఖలు చేసే గడువు కూడా ముగిసింది. వాటిని ఉపసంహరించుకోవడానికి 29వ తేదీ వరకు గడువు ఉంది.
మే 13వ తేదీన పోలింగ్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకరవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ ఎన్నికల గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి.

2019 నాటి ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందించుకుంది. అప్పటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సంఖ్యను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉందా పార్టీ అగ్రనాయకత్వం. వైనాట్ 175/25 అనే నినాదంతో ప్రచార కార్యక్రమాలను చేపట్టింది.
దీనికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ తన మేనిఫెస్టోను తీర్చిదిద్దింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఈ మేనిఫెస్టోను ప్రకటించారు. 2019 తరహాలోనే రెండు పేజీలు మాత్రమే ఉన్న మేనిఫెస్టో ఇది.
2019లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించడంలో కీలకంగా మారిన నవరత్నాలను కొనసాగిస్తామని వెల్లడించారు జగన్. అవే హామీలను ఇచ్చారు. వాటి నగదు మొత్తాన్ని పెంచారు. సామాజిక భద్రత పింఛన్‌ను 3,000 నుంచి 3,500 రూపాయలు, రైతు భరోసా- రూ. 13,500 నుంచి 16,000 రూపాయలు, అమ్మఒడి-రూ.15,000 వేల నుంచి 17,000 వేలకు పెంచుతామని అన్నారు.

వైఎస్సార్ ఆసరా కింద 3 లక్షల వరకు సున్నా వడ్డీ వర్తింపు, ఈబీసీ నేస్తం కింద నాలుగు విడతల్లో 45,000 నుంచి 1,05,00 వేల రూపాయలు, అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ఇంటి పట్టాలు, చేయూత కింద 75,000 నుంచి 1,50,000, కాపు నేస్తం కింద ఇక నుంచి 60,000 నుంచి 1,20,000 వేలకు పెంచేలా హామీ ఇచ్చారు జగన్.
కాగా- పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను వైఎస్ జగన్ ప్రకటించే కార్యక్రమాన్ని లక్షలాది మంది టీవీల్లో తిలకించారు. టీవీలకు అతుక్కుపోయారు. వారిలో చాలామంది పేద, దిగువ మధ్య తరగతి కుటుంబీకులే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మైనారిటీలు సహా అన్ని వర్గాల ప్రజలు కూడా మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు.
దీనికి సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామనే ముద్ర తమ పార్టీ మీద ఉందని, 2019 నాటి మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేయడమే దీనికి కారణమని వైసీపీ నాయకులు అంటున్నారు. చెప్పింది చెస్తామనే విశ్వాసం ప్రజల్లో ఉండటం వల్లే వాళ్లు పార్టీ మేనిఫెస్టో గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications