చంచల్‌గూడ చరిత్ర సగంలో ఆగింది...ఇక జైల్లోనే... జగన్‌పై టీడీపీ సంచలన విమర్శలు..

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలను టార్గెట్ చేస్తూ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. 'చంచల్‌గూడ చరిత్ర పుస్తకం సగంలో ఆగింది. ఏడాది చెత్త పాలన తర్వాత యుశ్రారైకాపాను క్యాడర్ నుంచి లీడర్ వరకూ ఛీ కొడుతున్నారు. ఇక జైల్లో చిరిగిన కాగితాలపై అవినీతి చరిత్ర చెక్కుకోవడం తప్ప భవిష్యత్ అంతా అంధకారం. కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం బై శకుని మామ' అంటూ ట్విట్టర్‌లో విమర్శించారు.

మరో ట్వీట్‌లో 'లచ్చల్ లచ్చల్ ఇళ్ల స్థలాలు పంచేస్తాం అంటూ డబుల్ రేటుకి కొనేసి,పేదల నుండి లాగేసి జగన్ భూకుంభకోణానికి తెరలేపాడు. పాపం బులుగు పార్టీ బ్యాచ్‌కి పంచడానికి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దొంగ కాగితాలతో లచ్చ కోట్లు సృష్టించిన వాడు కరోనాకి వ్యాక్సిన్ ఎందుకు పేరాసిట్మాల్ ఉండగా అన్నాడట' అంటూ విమర్శలు గుప్పించారు.

jagans future is dark writing corruption book in jail only remains says ayyannapatrudu

మరో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కూడా ట్విట్టర్‌లో జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. 'ముఖ్యమంత్రి గారూ! మీకోసం పార్లమెంటు సీటు త్యాగం చేసిన మీ బాబాయి హత్య కేసులో ఉదాసీనత, మీరు సీఎం కావాలని ఉబలాట పడిన సీఎస్ LV సుబ్రహ్మణ్యం అగౌరవ నిష్క్రమణ, మీరు ముఖ్యమంత్రి అయితే ప్రత్యర్థులను సాధించాలనుకున్న అజయ్ కళ్లంకు ఆశాభంగం, PV రమేష్‌కు శృంగభంగం, అంతా వాడి వదిలేశారు గదా?' అంటూ విమర్శించారు.

Recommended Video

    Corona చికిత్సను Aarogyasri పరిధిలో చేర్చిన AP ప్రభుత్వం.. రేట్ ఫిక్స్! || Oneindia Telugu

    మాజీ ఎమ్మెల్యే,టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు కూడా వైసీపీపై ఫైర్ అయ్యారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... గతంలో అయ్యన్నపాత్రుడు,యనమల,అచ్చెన్నాయుడు,కొల్లు రవీంద్రలపై ఎలాంటి కేసులు లేవన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ కక్ష సాధింపుతోనే వీళ్లను టార్గెట్ చేశారని ఆరోపించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+