అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరోసారి అయిదుగురు డిప్యూటీ సీఎంలు - వికీపీడియాలో హోం మంత్రిగా రోజా : కొత్త లెక్కలు ఇలా..!!

|
Google Oneindia TeluguNews

సీఎం జగన్ కేబినెట్ 2.0 కొలువు తీరుతోంది. 25 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రులు ఖరారయ్యారు. దీంతో..ఇక డిప్యూటీ సీఎంలు..మంత్రులకు దక్కే పదవుల పైన ఆసక్తి నెలకొని ఉంది. పదవులు దక్కని వారి అనుచరులు ఆందోళన చేస్తుంటే.. పదవులు దక్కిన వారి అనుచరులు తమ నేతలకు ఏ శాఖలు ఇస్తారనే అంశం పైన ఉత్కంఠతో ఉన్నారు. అయితే, గత కేబినెట్ లో అమలు చేసిన ఫార్ములానే ఇప్పుడూ కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయించారు. గతంలో తరహాలోనే...బీసీ-ఎస్సీ-ఎస్టీ-మైనార్టీ-కాపు వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కనున్నాయి.

మరోసారి అయిదుగురు డిప్యూటీ సీఎంలు

మరోసారి అయిదుగురు డిప్యూటీ సీఎంలు


అందులో భాగంగా ఎస్టీ వర్గం నుంచి పీడిక రాజన్న దొర (ఉత్తరాంధ్ర), మైనార్టీ వర్గం నుంచి అంజాద్ బాషా (రాయలసీమ) ఖాయమయ్యాయి. ఇక, గత కేబినెట్ లో అయిదుగురు డిప్యూటీ సీఎంల్లో ఒక మహిళకు ఎస్టీ వర్గం నుంచి పుష్పశ్రీవాణీకి కేటాయించారు. ఈ సారి ఒక డిప్యూటీ సీఎం పదవి మహిళకు దక్కనుంది. అందులో భాగంగా ఎస్సీ వర్గం నుంచి నారాయణ స్వామి డిప్యూటీ సీఎంగా గతంలో ఉన్నారు. ఈ సారి ఎస్సీ వర్గం నుంచి డిప్యూటీ సీఎం పదవి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మంత్రిగా రెండో సారి కొనసాగుతున్న తానేటి వనితకు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

హోం మంత్రిగా తానేటి వనిత..!

హోం మంత్రిగా తానేటి వనిత..!

అదే విధంగా హోం మంత్రి గత కేబినెట్ లో ఎస్సీ మహిళకు కేటాయించారు. పలు సందర్భాల్లో ఎస్సీ మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చిన అంశాన్ని సీఎం చెప్పుకొచ్చారు. దీంతో.. ఇప్పుడు కూడా అదే విధానం కంటిన్యూ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీంతో..తానేటి వనిత ఒక్కరే ఎస్సీ మహిళా మంత్రిగా ఉండటం..అందునా గోదావరి జిల్లాల సామాజిక సమీకరణాల్లో భాగంగా హోం శాఖ కేటాయించి డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఇక, కాపు వర్గానికి డిప్యూటీ సీఎం గతంలో పశ్చిమ గోదావరికి దక్కగా.. ఈ సారి తూర్పు గోదావరికి కేటాయించే ఛాన్స్ ఉంది. దాటిశెట్టి రాజాకు కాపు వర్గంలో డిప్యూటీ సీఎం ఇస్తారని తెలుస్తోంది. చివరి నిమిషంలో సమీకరణాలు మారితే అంబటి రాంబాబుకు ఛాన్స్ ఉంది.

బీసీ కేటగిరీ నుంచి ధర్మానకు ఛాన్స్

బీసీ కేటగిరీ నుంచి ధర్మానకు ఛాన్స్

బీసీ వర్గం నుంచి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తి కరంగా కనిపిస్తోంది. బీసీ వర్గం నుంచి బొత్సా సత్యనారాయణ లేదా ధర్మాన ప్రసాదరావుల్లో ఒకిరికి దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే, అనూహ్యంగా రోజాకు మంత్రి పదవి ఖరారు కాగానే..హోం మంత్రిగా రోజా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అనూహ్యంగా వికీపీడియాలో సైతం రోజాను సీఎం జగన్ హోం మంత్రిగా నియమించారంటూ అందులో అప్ డేట్ కనిపిస్తోంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పోర్టుఫోలియోల కేటాయింపు పైనా ఉత్కంఠ

పోర్టుఫోలియోల కేటాయింపు పైనా ఉత్కంఠ


మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే.. మంత్రులకు పోర్టు ఫోలియోలు కేటాయించనున్నారు. కీలకమైన ఆర్దిక శాఖ తిరిగి బుగ్గనకే కేటాయించనున్నారు. ధర్మానకు రెవిన్యూ ఖాయమని చెబుతున్నారు. రోజాకు పరిశ్రమల శాఖ ఇస్తారని తెలుస్తోంది. అదే విధంగా.. వ్యవసాయ శాఖను కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు శాఖల కేటాయింపు పైన ఉత్కంఠ కొనసాగుతోంది.


English summary
Jagans new cabinet will have five deputy CMs while Roja will have home ministry according to Wikipedia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X