సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెచ్చగొట్టే వ్యాఖ్యల కేసు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jagga Reddy arrest
మెదక్: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో సంగారెడ్డి కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గా రెడ్డి)ని మెదక్ జిల్లా సిద్దిపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 2010లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని జగ్గా రెడ్డి పైన కేసు నమోదయింది. పలుమార్లు కోర్టుకు జగ్గారెడ్డి హాజరు కాలేదు. దీంతో ఆయనకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

దీంతో ఈ రోజు పోలీసులు జగ్గా రెడ్డిని అరెస్టు చేశారు. ఆయనను సిద్దిపేట కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు న్యాయస్థానం పద్నాలుగు రోజుల జ్యూడిషియల్ రిమాండును విధించింది. అనంతరం ఆయనను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించిన కేసును కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

మరోవైపు జగ్గా రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అది కూడా సోమవారం (7వ తేదీన) విచారణకు రానుంది. జగ్గా రెడ్డి రెండు రోజుల పాటు జైలులో ఉండే అవకాశముంది. ఆ తర్వాత సోమవారం కేసు, బెయిల్... రెండింటి పైన విచారణ జరగనుంది.

కాగా, తూర్పు జయప్రకాశ్ రెడ్డి సంగారెడ్డి నుండి కాంగ్రెసు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం సమయంలో ఆయన తెరాసలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలో చేరారు. మొదట కరడుగట్టిన తెలంగాణవాదిగా ఉన్న ఆయన.. ఇటీవల సమైక్యం వైపు మొగ్గు చూపారు.

English summary
Congress leader and Sanga Reddy MLA Jagga Reddy has been arrested by Medak district police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X