మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీ జనసేనపై జగ్గారెడ్డి ఆశ: పవన్ నో, బిజెపిలోకి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Jagga Reddy may join and contest from Medak
సంగారెడ్డి: ప్రభుత్వ మాజీ విప్, సంగారెడ్డి కాంగ్రెస్ మాజీ శాసనభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి త్వరలో బిజెపిలో చేరనున్నారు. ఈ ఎన్నికలలో ఆయన శాసనసభా సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓటమికి గల కారణాలను సమీక్షించుకున్న జగ్గారెడ్డి కాంగ్రెస్‌ను వీడాలన్న నిర్ణయానికి వచ్చారు.

అందులో భాగంగానే సోమవారం జనసేన వ్యవస్థాపకుడు పవన్‌కల్యాన్‌ను కలిసి మాట్లాడారు. త్వరలోనే బిజెపిలో చేరనున్న జగ్గారెడ్డి పార్టీ టికెట్ ఇస్తే మెదక్ లోక్‌సభకు జరగనున్న ఉప ఎన్నికలో పోటీకి సిద్ధంగా ఉన్నారు. బిజెపిలో చేరే విషయమై ఆయన ఇప్పటికే పార్టీ జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులతో చర్చించారు. 1987లో బీజేపీ నుంచి మునిసిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1995లో అదే పార్టీ నుంచి మునిసిపల్ చైర్మన్ అయ్యారు.

బిజెపి నాయకులందరితో సత్సంబంధాలుండడంతో జగ్గారెడ్డి ఆ పార్టీలో చేరేందుకు మార్గం సుగమమైనట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్‌తో జగ్గారెడ్డి భేటీ సుమారు రెండుగంటలపాటు సాగింది. తెలంగాణలో జనసేన ఏ విధంగా ఉండాలన్న దానిపైనే ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా తెలంగాణలో జనసేన బాధ్యతలను స్వీకరించేందుకు జగ్గారెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణలో జనసేనను బలోపేతం చేద్దామన్న జగ్గారెడ్డి సూచనను పవన్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై తాను ఇప్పుడేమీ ఆలోచించడం లేదని పవన్ చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయన బిజెపిలోకి చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

English summary

 Congress ex MLA from Sangareddy Jaggareddy may join in BJP, as Pawan Kalyan was not interested activate his Jana sena at present.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X