కృష్ణాజిల్లాలో వైసీపీకి బిగ్ షాక్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక , కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది జగన్ పార్టీ. కూటమి దెబ్బకు వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో నాయకులు ఒకొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీతో పాటు పదవులకు సైతం రాజీనామా చేశారు. ఇప్పటికే పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు.
తాజాగా వైసీపీకి ఉమ్మడి కృష్ణాజిల్లాలో బిగ్ షాక్ తగిలింది. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో రాఘవేంద్ర పసుపు జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారందరిని లోకేష్ సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు.

వైసీపీ సిద్ధాంతాలు, విధానాలు నచ్చక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని నారా లోకేశ్ తెలిపారు. సమిష్టిగా పని చేసి జగ్గయ్య పేట మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఇక జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం పార్టీని వీడుతారనే జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో తనతో పాటు పార్టీ కూడా ఓడిపోవడంతో ఆయన రాజకీయంగా సెలైంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు సైతం సామినేని దూరంగా ఉంటున్నారు.
ఈక్రమంలోనే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే సమాచారం అందుతోంది. ఆయన ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం పార్టీని వీడటానికి సిద్దమయ్యారని తెలుస్తోంది. ఆయన ఒంగొలు నియోజకవర్గ కార్పోరేటర్లు,ప్రజా ప్రతినిధులతో సమావేశం అయ్యారు. త్వరలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి తన రాజీకయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. బాలినేని సైతం జనసేనలోనే చేరుతారనే ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications