23 అర్ధరాత్రే డెడ్‌లైన్, కోర్టుకెళ్లొచ్చు: కిరణ్‌పై జైపాల్ ఫైర్

రాజ్యాంగ ప్రక్రియకు ఇరు ప్రాంతాల నేతలు సహకరించాలని తాను కోరుతున్నానన్నారు. బిల్లు పైన చర్చించకుండా ఓ మంత్రి శాఖను మార్చడం ఎంత వరకు సమంజసమన్నారు. శాఖ మార్చడం వల్ల ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారో చెప్పాలన్నారు. ఇరు ప్రాంతాల నాయకులు అసెంబ్లీలో అభిప్రాయాలు చెప్పుకోవాలని అంతేకానీ, కాలచక్రాన్ని తప్పుదారి పట్టించడం సరికాదన్నారు.
ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అందరు బిల్లుపై చర్చకు సహకరించాలని కోరారు. బిల్లులో ఏమైనా లోపాలు ఉంటే కోర్టుకు వెళ్లవచ్చునని కానీ, చర్చను అడ్డుకోవడం మాత్రం సరికాదన్నారు.
ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి వరకే తెలంగాణ బిల్లు అసెంబ్లీ చేతిలో ఉంటుందని, ఆ తర్వాత చర్చించుదామన్నా అవకాశం ఉండదన్నారు. తెలంగాణ బిల్లును ఆపడం ఎవరి తరం కాదన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగానే మౌనం వహిస్తున్నారన్నారు.
విడిపోతున్న సమయంలో మనస్పర్థలు పెంచడం మంచిది కాదని, ఎత్తులకు పైఎత్తులు వేయడం మానుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అవరాధాలు ఉండటంతో ఆలస్యం అయిన మాట వాస్తవమే అయినా, ఇంత త్వరగా ఏ రాష్ట్రం ఏర్పడలేదన్నారు. తెలంగాణ ఆపడం ఎవరి తరం కాదన్నారు.
అసెంబ్లీకి అభిప్రాయం చెప్పే హక్కు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని తాము బలంగా నమ్ముతున్నామన్నారు. బిల్లు ప్రక్రియను హైజాక్ చేసే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. బిల్లులో లోటుపాట్లు ఉంటే సూచనలు ఇవ్వవచ్చునన్నారు. విడిపోతున్న సమయంలో మనస్ఫర్థలు వద్దన్నారు.












Click it and Unblock the Notifications