విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడలో జలసౌధ: రూ.5 కోట్లతో ఐదంతస్తుల భవనం

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విజయవాడలో జలసౌధ ఏర్పాటుకానుంది. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉన్నందువల్ల ఎపీ నీటిపారుదలశాఖ ప్రధాన కార్యాలయం ప్రస్తుతం అక్కడే కొనసాగుతోంది. భవిష్యత్‌లో కొత్త రాజధానిలోనే హెడ్‌ క్వార్టర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఇరిగేషన్‌ కాంపౌండ్‌ ఉంది.

కృష్ణాడెల్టా ఆధునికీకరణలో భాగంగా డెల్టా చీఫ్‌ ఇంజనీర్‌ కోసం రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు. అందులో మంత్రి దేవినేని ఉమా క్యాంప్‌ కార్యాలయంతోపాటు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) క్యాంప్‌ ఆఫీసును ఏర్పాటు చేశారు. నీటిపారుదలశాఖ ప్రధాన కార్యదర్శి, కాడా కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలను కూడా ఇక్కడే ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపధ్యంలో విజయవాడ నీటిపారుదలశాఖ కార్యాలయం ఆవరణలోనే జలసౌధను నిర్మించాలని మంత్రి దేవినేని భావిస్తూండటంతో అందుకనుగుణంగా ఇక్కడ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు ఇరిగేషన్‌శాఖ కసరత్తు చేస్తోంది.

డెల్టా ఆధునికీకరణలో భాగంగా అధికారులు నివాసం ఉంటున్న బంగళాలను కూల్చి బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేందుకు ఇప్పటికే ప్రణాళికను రూపొందించారు. రాష్ట్రస్థాయి కార్యాలయాలన్నీ విజయవాడ వచ్చే అవకాశాలు ఉండటంతో ఇరిగేషన్‌ ప్రధాన కార్యదర్శి, కాడా కమిషనర్‌, ఈఎన్‌సీ, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సుమారు ఐదు కోట్ల రూపాయలతో భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్లాన్‌ సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయంలో పరిశీలనకు ఉన్నట్లు సమాచారం.

Jala Soudha tio be built in Vijayawada

సీడీఓ సీఈ ఆమోదం పొందిన వెంటనేే భవన నిర్మాణానికి శ్రీకారం చుడతారని తెలుస్తోంది. సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణం జరగవచ్చని భావిస్తున్నారు. ఇరిగేషన్‌ కార్యదర్శి క్యాంప్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి క్యాంప్‌ కార్యాలయం ఉన్న బ్లాక్‌లోనే ఒక వైపున కార్యదర్శి క్యాంప్‌ ఆఫీసును ఏర్పాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

బ్రిటీష్‌ హయాంలో నిర్మించిన భవనంలో ఎస్‌ఈ, ఈఈ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఆ భవనం మొదటి అంతస్తులో స్పెషల్‌ డివిజన్‌ కార్యాలయం ఉంది. ఆ భవనం వెనుకే బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే ఈఎన్‌సీ, మైనర్‌ ఇరిగేషన్‌, భూగర్భజలశాఖ, సీడీఓ సీఈ క్యాంప్‌ ఆఫీసులు ఇరిగేషన్‌ కాంపౌండ్‌లోనే ఏర్పాటయ్యాయి.

English summary
Jala Soudha will be built at Vijayawada with a cost of Rs 5 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X