అసెంబ్లీకి రాకుండా రోడ్లపై గొర్రెల్లా తిరుగుతున్నారు...వాళ్లకి జీతాలెందుకు?: వైసిపిపై జలీల్ ఖాన్
విజయవాడ: అసెంబ్లీకి రాకుండా రోడ్ల మీద గొర్రెల్లాగా తిరుగుతున్న వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడానికి అనర్హులని ఏపీ వక్ఫ్‌బోర్డు చైర్మన్, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విమర్శించారు.
అందుకే వాళ్లు తమ జీతాలను రాష్ట్ర ఖజానాకు జమచేయాలని జలీల్‌ఖాన్ సూచించారు. మంగళవారం విజయవాడలోని స్టేట్‌గెస్ట్ హౌస్‌లో జలీల్ ఖాన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అల్లకల్లోలం కావడం ఖాయం అని జలీల్ ఖాన్ పేర్కొన్నారు.రాష్ట్రంలో పరిపాలన శాంతియుతంగా జరుగుతుందని, చంద్రబాబే హీరో అని, జగన్, పవన్, కన్నా ఈ ముగ్గురు విలన్లని అన్నారు.

గతంలో పీఆర్‌పీ తరుపున 16 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే...2019లో జనసేనకు ఒక్కసీటు కూడా రాదని జలీల్ ఖాన్ జోస్యం చెప్పారు. జగన్ పార్టీకి 27 సీట్లు కూడా రావని లన్నారు. కార్పొరేటర్‌గా గెలవలేని జివిఎల్ నరసింహారావు టీడీపీపై విమర్శలు చేయటం సిగ్గుచేటు అని జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు. ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరులోనే కన్నం ఉంది అని, ముఖ్యమంత్రి అనుమతిస్తే కన్నా పై పోటీ చేస్తానన్నారు. మంత్రిగా ఉన్నపుడు కన్నా అనేక రకాలుగా అవినీతి పాల్పడ్డారని అన్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసిపి విద్యార్థి యువజన విభాగం విమర్శల వర్షం కురిపించింది.
నిరుద్యోగులను మోసం చేయడాన్ని ఖండిస్తూ "నిరుద్యోగ వంచన" పేరుతో గుంటూరు లో యువజన , విద్యార్ధి విభాగాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 2014 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికో ఉద్యోగం .. రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని యువతను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు మళ్ళీ మోసం చేస్తున్నాడని వైసిపి విద్యార్థి యువజన విభాగం ఆరోపించింది.
నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 20 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ప్రకటించడం దారుణమని వైసిపి విద్యార్థి విభాగం విమర్శించింది.
టిడిపి అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను దాదాపు 80 వేల మందిని తొలగించినట్లు వైసిపి విద్యార్థి విభాగం ఆరోపించింది. ఉద్యోగాల నోటిఫికేషన్ లో సైతం నిరుద్యోగులను మోసం చేసారని ఆరోపించింది. ఆయా ఉద్యోగులను తొలగించి వారి కుటుంబాలను సైతం వీధులపాలు చేసిందని ధ్వజమెత్తారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications