విశాఖపట్నానికి సూపర్ గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు భారతీయ రైల్వే స్పెషల్ ట్రైన్స్‌ని ప్రకటిస్తుంది. అప్పటికే నడుస్తున్న కొన్ని సర్వీసులను పొడిగిస్తుంటుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నం నుంచి జన్ సాధారణ్ రైలును ప్రకటించింది.విశాఖపట్నం-రంగపర నార్త్, రంగపర నార్త్,-విశాఖపట్నం రూట్స్‌లో ఇది అందుబాటులో ఉండనుంది. మొత్తం అన్నీ జనరల్ బోగీలే ఉంటాయి. ఈ రైలుకు రిజర్వేషన్ అవసరంలేదు. వారానికోసారి నడుస్తుంది. ఆగస్ట్ 31 వరకు జన్ సాధారణ్ రైలు అందుబాటులో ఉంటుంది.

నెంబర్ 08562 విశాఖపట్నం నుంచి రంగపర నార్త్ వరకు ప్రతి ఆదివారం (శనివారం) మధ్యరాత్రి 12.10 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరుతుంది. సోమవారం ఉదయం 10.00 గంటలకు రంగపర నార్త్ చేరుకుంటుంది.నెంబర్ 08561 రంగపర నార్త్ నుంచి విశాఖపట్నం వరకు ప్రతి మంగళవారం తెల్లవారుజామున 5.15 గంటలకు రంగపర నార్త్‌లో బయల్దేరి బుధవారం మధ్యాహ్నం 3.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

train7

విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, బర్హంపూర్, ఖుర్దారోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్ జంక్షన్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ జంక్షన్, అందుల్, డంకుని జంక్షన్, బర్ధమాన్ జంక్షన్, రంపూర్హత్ జంక్షన్, మాల్దా టౌన్, బర్సోయ్ జంక్షన్, కిషన్ గంజ్, న్యూ జల్పాయ్‌గురి జంక్షన్, జల్పాయ్‌గురి రోడ్, మథభంగ, న్యూకోచ్ బెహర్, కోక్రాఝర్, న్యూ బాన్గాయ్‌గావ్ జంక్షన్, బార్పేట రోడ్, నల్బరి, రంగియా జంక్షన్, టంగ్లా, ఉదల్‌గురి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. సెకండ్ క్లాస్ సిట్టింగ్ ఉన్న కోచ్ లు 7, గార్డ్ కమ్ లగేజ్ వ్యాన్స్ 2 ఉంటాయి. అన్నీ జనరల్ బోగీలే. స్లీపర్ బోగీలు ఏర్పాటు చేయరనే విషయాన్ని ప్రయాణికులు గమనంలో ఉంచుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+