శ్రీరెడ్డి సహా వారికి కౌంటర్.. బాధగా ఉంటుంది, కానీ: పవన్ కళ్యాణ్ వీడియో వైరల్

Posted By:
Subscribe to Oneindia Telugu
  శ్రీరెడ్డి సహా వారికి కౌంటర్.. బాధగా ఉంటుంది, కానీ: పవన్ కళ్యాణ్ వీడియో వైరల్

  హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కొందరు మహిళా నటులు లక్ష్యంగా పెట్టుకొని మాట్లాడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అభిమానులు ఆయనకు చెందిన ఓ పాత వీడియోను పోస్ట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.

  'ఒక్కోసారి ఎవరైనా నన్ను తిడితే మీకు బాధగా వుంటుంది అని నాకు తెలుసు. కానీ మనం భరిద్దాం. బలవంతుడే భరిస్తాడు. భరించినవాడే గెలుస్తాడు.' అని పవన్ ఇటీవల తెలంగాణ పర్యటనలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు మహిళా నటుల విమర్శల నేపథ్యంలో దీనిని వైరల్ చేస్తున్నారు.

  Jana Sena fans counter video who alleges Pawan Kalyan

  'ఒక్కోసారి నన్ను తిడుతుంటే అది మీకు అందరికీ ఇబ్బంది కలిగించవచ్చు. నేను భరిస్తాను. బలవంతుడే భరిస్తాడు. మనం బలమైన వ్యక్తులం. భరిద్దాం. భరించినవాడే సాధించగలడు. అంతేగానీ మనం... మాట అనేశారు అనిచెప్పి పారిపోతే ఎలా? అలా పారిపోవద్దు దేనినుంచీ. అలాగని చెప్పి ఎదురుదాడి చేయవద్దు. భరించండి. అలా చూడండి. ఎంతసేపు అంటుంటే అంతసేపు చూడండి. మార్పు దానంతట అదే చాలా సైలెంట్ గా వచ్చేస్తుంది. భరించడం వల్ల చాలా బలమైన శక్తి లోపలి నుంచి వస్తుంది. మనం తప్పు చేయకుండా, మనల్ని అంటుంటే, చాలా బాధ ఉంటుంది. చాలా కోపం ఉంటుంది. చాలా ఆవేదన ఉంటుంది. నాకు కూడా కచ్చితంగా ఉంటుంది. చాలా బాధ ఉంటుంది. భరిద్దాం' అని పవన్ జనసేన కార్యకర్తల ముందు చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది.

  ఇటీవల నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పైన మాటల దాడి చేసిన విషయం తెలిసిందే. పలువురు మహిళా నటులు ఇలాగే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఈ వీడియో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jana Sena fans counter video who alleges Jana Sena chief Pawan Kalyan.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి