కాపు నేత ముద్రగడ పద్మనాభంను కలిసిన జనసేన నాయకులు
అమరావతి: జనసేన పార్టీ నేతలు శుక్రవారం కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. జనసేన పార్టీని బలపర్చుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంను జనసేన బృందం కలిసింది. జనసేన పార్టీ కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య ఆధ్వర్యంలో ఆయనతో చర్చలు కొనసాగాయి.

ముద్రగడ పద్మనాభంతో జనసేన బృందం ఏయే అంశాలపై చర్చలు జరిపిందనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, జనసేన పార్టీ ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications