జనసేన పార్టీ సీట్ల సర్దుబాటుః వామపక్షాలకు చెరో ఏడు అసెంబ్లీ, రెండు లోక్‌సభ ఖరారు
అమరావతిః రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఇన్నాళ్ల పాటు నాన్చుడు ధోరణిని ప్రదర్శించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బహుజన సమాజ్‌వాది పార్టీతో పొత్తు, సీట్ల సర్దుబాటు తరువాతే ఆయన వామపక్షాలను కరుణించారు. ఆదివారం ఉదయం బీఎస్పీతో సీట్ల సర్దుబాటును ముగించుకున్న తరువాత వామపక్షాలపై దృష్టి పెట్టారు. రాత్రి 9 గంటల సమయంలో పొత్తు చర్చలు తుది రూపానికి వచ్చాయి. సీపీఎం, సీపీఐలకు చెరో రెండు లోక్‌సభ, ఏడు అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. ఏఏ స్థానాల్లో పోటీ చేయాలనే విషయంపై కూడా స్పష్టత వచ్చింది.

సీపీఎంకు కేటాయించిన స్థానాలు ఇవీ..
అసెంబ్లీ స్థానాలు
కురుపాం (విజయనగరం జిల్లా)
అరకు (విశాఖపట్నం జిల్లా)
రంపచోడవరం (తూర్పుగోదావరి జిల్లా)
ఉండి (పశ్చిమగోదావరి జిల్లా)
విజయవాడ సెంట్రల్ (కృష్ణా జిల్లా)
సంతనూతలపాడు (ప్రకాశం జిల్లా)
కర్నూలు.
పార్లమెంటు స్థానాలు
కర్నూలు
నెల్లూరు
సీపీఐకి కేటాయించిన స్థానాలివీ..
అసెంబ్లీ స్థానాలు
పాలకొండ (శ్రీకాకుళం జిల్లా)
శృంగవరపు కోట (విజయనగరం జిల్లా)
విశాఖ వెస్ట్ (విశాఖపట్నం జిల్లా)
నూజివీడు (కృష్ణా జిల్లా)
మంగళగిరి (గుంటూరు జిల్లా)
కనిగిరి (ప్రకాశం జిల్లా)
డోన్ (కర్నూలు జిల్లా)
పార్లమెంటు స్థానాలు
అనంతపురం
కడప












Click it and Unblock the Notifications