Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జనసేన కార్యకర్తలకు తాలిబన్లకు తేడా లేదు ; జగన్ మంత్రి పదవిస్తే .. భీమవరం ఎమ్మెల్యే సెన్సేషన్ !!

భీమవరం కేంద్రంగా అధికార వైసిపి, జనసేన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇటీవల భీమవరం కేంద్రంగా జనసేన నాయకులు వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వివాదంగా మారగా తాజాగా గ్రంధి శ్రీనివాస్ జనసేన కార్యకర్తలను నేతలను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా గ్రంధి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో ఆయన తన మనసులో మాట కూడా చెప్పారు.

జనసేన నేతలు పిల్ల చేష్టలకు పాల్పడుతున్నారు

జనసేన నేతలు పిల్ల చేష్టలకు పాల్పడుతున్నారు

వైసిపి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జనసేన కార్యకర్తలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా మాట్లాడితే చాలు జనసేన కార్యకర్తలు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు. ఒక్క భీమవరం లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన నేతలు పిల్ల చేష్టలకు పాల్పడుతున్నారు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు గ్రంధి శ్రీనివాస్. అంతేకాదు జనసేన కార్యకర్తలకు తాలిబన్లకు తేడా ఏమీ లేదని విమర్శలు గుప్పించారు. జనసేన కార్యకర్తలు ఎలాంటి వారో స్వయంగా మెగా హీరోలే చెప్పారని మండిపడ్డారు.

జనసేన కార్యకర్తల గురించి మెగా హీరోలే చెప్పారు

జనసేన కార్యకర్తల గురించి మెగా హీరోలే చెప్పారు

అల్లు అర్జున్, నాగబాబు, పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తల గురించి చెప్పారని పేర్కొన్నారు గ్రంధి శ్రీనివాస్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం ప్రజలకు కనిపించలేదని వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే, తన పైన ఫ్లెక్సీలు పెట్టిన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ పై పెడితే బాగుండేదని వ్యాఖ్యానించారు. నాయకా .. మళ్లీ కనుమరుగైపోయావ్ .. నల్లపూస అయ్యావ్.. భీమవరం రావయ్యా పవన్ కళ్యాణ్ అని ఫ్లెక్సీ పెడితే బాగుండేదని జనాలు కూడా హర్షించే వాళ్ళని గ్రంధి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ భీమవరం రాలేదని పవన్ ను టార్గెట్ చేశారు.

మంత్రి పదవి ఇస్తే పని చేస్తానని మనసులో మాట చెప్పిన గ్రంథి శ్రీనివాస్

మంత్రి పదవి ఇస్తే పని చేస్తానని మనసులో మాట చెప్పిన గ్రంథి శ్రీనివాస్

తనను ఏమీ చేయలేక గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను తనపై పోటీకి నిలిపారని, ఇప్పుడు తనని అపఖ్యాతిపాలు చేయడానికి ఫ్లెక్సీలు పెట్టి రచ్చ చేస్తున్నారని విమర్శించారు .తాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానని తెలిపారు. మంత్రి పదవి ఇచ్చినా భీమవరం అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తానని గ్రంధి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని టార్గెట్ చేస్తూ గ్రంధి శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు, అలాగే మంత్రి పదవికి తాను సై అంటూ ఇస్తున్న సంకేతాలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

భీమవరం అభివృద్ధిపై జనసేన ఫ్లెక్సీ రగడ .. గ్రంథి వ్యాఖ్యలపై చర్చ

భీమవరం అభివృద్ధిపై జనసేన ఫ్లెక్సీ రగడ .. గ్రంథి వ్యాఖ్యలపై చర్చ

భీమవరం అభివృద్ధి విషయంలో వెనుకబడిందని, ఎమ్మెల్యే వాటర్ ట్యాంక్ నిర్మాణానికి, సిసి రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని భీమవరం అభివృద్ధిపై ఎమ్మెల్యే దృష్టి సారించాలని జనసేన నేతలు భీమవరంలో పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో వైసీపీ, జనసేన నేతల మధ్య ఇటీవల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జనసేన కార్యకర్తలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు, తాలిబన్లతో పోలుస్తూ చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+