Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పొత్తు దిశగా బీజేపీ..జనసేన..! ఢిల్లీలో పవన్ మంతనాలు: మారుతున్న సమీకరణాలు..!

ఏపీలో కొత్త పొత్తు దిశగా సమీకరణాలు మారుతున్నాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా కొత్త అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరెస్సెస్ ప్రముఖులతో సమావేశం అయినట్లు వివ్వసనీయ సమాచారం. కొద్ది రోజులు పవన్ బీజేపీ అధినాయకత్వానికి మద్దతుగా చేస్తున్న వ్యాఖ్యలు..అమరావతి అంశం కేంద్రానిని నివేదిస్తానని చెప్పటం..తాజాగా పార్టీ సమావేశంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు లేకపోవటం కారణంగానే నష్టపోయామంటూ చేసిన వ్యాఖ్యలు పవన్ వ్యూహాలను స్పష్టం చేస్తున్నాయి.

ఏపీలో ఇప్పుడు వైసీపీ ఎదుర్కోవాలంటే బీజేపీతో పొత్తు అవ సరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ నేతలు మాత్రం బీజేపీతో కాకుండా టీడీపీతో వెళ్లాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ కేంద్రంగా జనసేన..బీజేపీ మధ్య పొత్తు దిశగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. దీని పైన పవన్ అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. పొత్తు ఖరారైతే స్థానిక సంస్థల ఎన్నికల నుండే రెండు పార్టీల మధ్య మైత్రి ప్రారంభం కానుంది.

బీజేపీ..జనసేన మధ్య పొత్తు..

బీజేపీ..జనసేన మధ్య పొత్తు..


=2019 ఎన్నికల వరకు బీజేపీ పైన విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ వైఖరిలో ఎన్నికల తరువాత మార్పు కనిపిస్తోంది. తానా సభల కోసం అమెరికా వెళ్లిన సమయంలోనే అక్కడ బీజేపీ మఖ్య నేత రాం మాధవ్ తో పవన్ సమావేవమయ్యారు. ఆ తరువాత అనేక సందర్భాల్లో పవన్ తాను జనసేనను ఏ పార్టీలో విలీనం చేయనని చెబుతూనే..కొద్ది కాలంగా పొత్తు అంశం గురించి మాత్రం పదే పదే ప్రస్తావిస్తున్నారు. చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ..కేంద్ర హోం మంత్రి అమిత్ షా పైన సానుకూలంగా మాట్లాడారు. ఇక, అమరావతి అంశం పైనా తాను కేంద్రంతో చర్చిస్తానని పవన్ హామీ ఇచ్చారు. శనివారం పార్టీ ముఖ్య నేతల సమావేశంలోనూ పవన్ 2019 ఎన్నికల్లో పొత్తు లేని కారణంగా నష్టపోయామంటూ వ్యాఖ్యానించారు. దీంతో..ఇప్పుడు జనసేన అధినేత ఢిల్లీ పర్యటన లో రహస్యంగా జరుగుతన్న భేటీల ద్వారా బీజేపీతో పొత్తు ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.

బీజేపీతోనా ..టీడీపీతోనా..

బీజేపీతోనా ..టీడీపీతోనా..

జనసేన పార్టీ సమావేశంలో ముఖ్య నేతలు మాత్రం బీజేపీతో కంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటూ అధినేత ముందు తమ అభిప్రాయం స్పష్టం చేసారు. అయితే, పవన్ మాత్రం టీడీపీతోనా..బీజేపీతోనా అనే విషయం పైనా మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే, జాతీయ రాజకీయాలు..ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు మేలనే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో దీని పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమైతే అది స్థానిక సంస్థల ఎన్నికల నుండే ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ..బీజేపీ మధ్య పొత్తు ద్వారా పార్టీకి మేలు జరగుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీకి జనసేన దగ్గరైతే కమ్యూనిస్టులు దూరం అవ్వటం కాయం. మరి..టీడీపీ విషయంలో పవన్ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తి కర అంశం.

అమరావతినే రాజధానిగా మద్దతిచ్చేలా

అమరావతినే రాజధానిగా మద్దతిచ్చేలా

ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న పరిణామాల పైనే పవన్ ముఖ్యంగా ఫోకస్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్న తరువాతనే తన కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేసారు. అదే సమయంలో పాలనా వ్యవహారాలు మొత్తం ఒకే చోట ఉండాలని డిమాండ్ చేసారు. దీంతో పాటుగా అమరావతి రైతులకు మద్దతుగా నిలుస్తానని..వారికి న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని పవన్ చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ బీజేపీ నేతలను ఎవరిని కలిసారనేది మాత్రం అధికారికంగా బయటకు పార్టీ నేతలు చెప్పటం లేదు. ఆరెస్సెస్ ప్రముఖులతో సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. ఆ చర్చల సారాంశం..ఏపీలో జనసేన..బీజేపీ మధ్య పొత్తు అంశంగా జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో..పవన్ ఢిల్లీ పర్యటన ముగిసిన తరువాత దీని పైన అధికారికంగా పొత్తు వ్యవహారం పైన క్లారిటీ ..భవిష్యత్ కార్యాచరణ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+