అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్లీజ్.. నమ్మండి.. మేం పొత్తులోనే ఉన్నాం: జనసేన-బీజేపీ

|
Google Oneindia TeluguNews

ఏపీలో జనసేన, భారతీయ జనతాపార్టీ మిత్రులుగా ఉన్నాయి. మిత్రులుగా ఉన్నామని బీజేపీ నేతలు చెబుతుంటారు. జనసేన నేతలు మాత్రం పొత్తుందని నోటితో చెప్పకుండా తల ఆడిస్తారు. అసలు వీరిద్దరూ కలిసి పోటీచేస్తారా? లేదా? అనే విషయంకన్నా కలిసి కార్యక్రమాలేమైనా చేశారా? అంటే అదీ లేదు. ఇరుపార్టీల మధ్య అగాధం సముద్రం కన్నా ఎక్కువ లోతుగా ఉంది.

ఎవరి కార్యక్రమాలు వారివే..

ఎవరి కార్యక్రమాలు వారివే..


ఎవరికివారే విడివిడిగా కార్యక్రమాలు రూపొందించుకొని పనిచేసుకుంటున్నారు. బీజేపీ ఇటీవల నిర్వహించిన గోదావరి గర్జనకానీ, భీమవరంలో ప్రధానమంత్రి పర్యటనకు కానీ, అమరావతి గ్రామాల్లో చేసిన పాదయాత్రకుకానీ జనసేనను ఆహ్వానించలేదు. తాజాగా విశాఖ వచ్చిన ప్రధానమంత్రిని పవన్ కల్యాణ్ కలిశారు. వివరాలేమీ బయటకు చెప్పమని ప్రకటించినప్పటికీ ఒకటి మాత్రం చెప్పారు. వైసీపీ విముక్త ఏపీ కోసం పోరాడతామని నాదెండ్ల మనోహర్ తో సహా జనసేన నాయకులు ప్రకటించారు.

ఇరుపార్టీలు స్నేహంగా ఉన్నాయా? లేదా? వారికే తెలియదు..

ఇరుపార్టీలు స్నేహంగా ఉన్నాయా? లేదా? వారికే తెలియదు..

అన్ని సీట్లలో పోటీచేస్తామంటారు. మరికొంత సేపు అందరినీ కలుపుకొని వెళతామంటారు. వారు ప్రజల కోసం మేలు చేయాలనుకుంటున్న విషయం బాగానే ఉందికానీ ఆచరణలో పెట్టే తీరులో మార్పు రావాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. బీజేపీతో మీకు పొత్తుందా? అని అడిగితే కరోనా వల్ల తమ ఇరుపార్టీల మధ్య భౌతిక దూరం పెరిగిందని, కరోనా తగ్గగానే అది కూడా తగ్గుతుందని పవన్ కల్యాణ్ ఒకానొక సమయంలో విశ్లేషించి చెప్పారు. కరోనా సమాజం నుంచి పోదు.. కాకపోతే రూపు మార్చుకుంటుంది.. పవర్ తగ్గుతుంది. అంటే జనసేన-బీజేపీ కూడా ఇలాగే అనుకోవాలా అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

జనసేనను శాసించినట్లుగా సోము వీర్రాజు..

జనసేనను శాసించినట్లుగా సోము వీర్రాజు..


జనసేన పార్టీ మాతోనే ఉంటుంది.. ఉండాలి అన్నట్లుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ పార్టీని శాసించినట్లు మాట్లాడతారు. తిరుపతి ఉప ఎన్నికల తర్వాత తాము నిర్వహించిన ఏ కార్యక్రమానికీ జనసేనానిని ఆహ్వానించకుండా ఆయన్ను ఎందుకు అవమానించారో సోము చెప్పరు. ఏ ఒక్క విషయానికీ గట్టిగా ఖండన ఇవ్వని జనసేన పొత్తులపై, భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టమైన ప్రకటన చేయాలనే డిమాండ్ ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది. చిత్రమేమిటంటే బీజేపీతో కలిసి పోటీచేస్తామనికానీ, వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని కానీ జనసేన చెప్పడంలేదు. బీజేపీ మాత్రం ఒకటే విషయం చెబుతోంది.. జనసేన తమతోనే ఉంటుందని. దాగుడుమూతలు ఆపి ఇరుపార్టీల నేతలు స్పష్టమైన ప్రకటన చేసినప్పుడే ఏపీలోని రాజకీయాలపై ఒక స్పష్టత వస్తుంది.

English summary
Jana Sena and Bharatiya Janata Party are allies in AP.BJP leaders say they are friends
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X